తిరుపతిలో వెలుగు చూసిన అక్రమ కట్టడాలు.. భారీ నిర్మాణం కూల్చి వేతకు నిర్ణయం

తిరుపతిలో వెలుగు చూసిన అక్రమ కట్టడాలు.. భారీ నిర్మాణం కూల్చి వేతకు నిర్ణయం
x
Highlights

అక్రమ నిర్మాణాలపై కొరడా ఎత్తిన ఏపీ ప్రభుత్వం తిరుపతిలోనూ కూల్చివేతలకు సిద్ధమయ్యింది. భూజు పట్టిన పైళ్లకు దుమ్ముదులిపి అక్రమ నిర్మాణాల జాబితాను సిద్ధం...

అక్రమ నిర్మాణాలపై కొరడా ఎత్తిన ఏపీ ప్రభుత్వం తిరుపతిలోనూ కూల్చివేతలకు సిద్ధమయ్యింది. భూజు పట్టిన పైళ్లకు దుమ్ముదులిపి అక్రమ నిర్మాణాల జాబితాను సిద్ధం చేస్తున్నారు అధికారులు. మొదటి దశలో డిపార్ట్ మెంట్ నోటీసులు రెండో దశలో లీగల్ నోటీసులు కాదు కూడదంటే కూల్చివేతలకు సిద్ధమవుతున్నారు అధికారులు. టూరిజం డిపార్ట్ మెంట్ ముసుగులో భారీ కట్టడాలు నిర్మించినట్లు గుర్తించిన అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రపంచప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రం తిరుపతిలోనూ అక్రమకట్టడాలు వెలిశాయి. భారీ చెరువును టూరిజం డిపార్ట్ మెంట్ అనధికారికంగా ఓ ప్రైవేట్ హోటల్ కు బదలాయించినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఫార్చున్ కెన్సస్ గ్రూపుకు చెందిన గ్రాండ్ రిడ్జి భారీ కట్టడాలను నిర్మించింది. రికార్డులు బయటకు తీసిన అధికారులు భారీ నిర్మాణానన్ని కూల్చి వేయాలని నిర్ణయించింది.. చెరువును యథాతధ స్థితికి తీసుకు రావాలని నిర్ణయించింది.

తిరుపతి నుంచి తిరుచానూరు వెళ్లే మార్గంలో ఉన్న గ్రాండ్ రిడ్జ్ పేరుతో ఉన్న త్రీస్టార్ హోటల్ తెలియని వారులేరు. అత్యంత సుందరమైన సువిశాలమైన స్థలంలో నిర్మించారు. ఎయిర్ పోర్ట్.. హైవేకు దగ్గరగా ఉంటుంది. తిరుపతికి వచ్చే ఏ ప్రయాణికుడైనా..యాత్రికుడైనా ఇందులోనే బస చేయాలనుకుంటారు.. అంతెందుకు ప్రభుత్వ.. ప్రైవేట్ మీటింగ్ లు కూడా ఇదే హోటల్ లోనే నిర్వహించే వారు. అయినా నేటి వరకు ఏ ఒక్కరు ఇది అక్రమంగా నిర్మించారని అనుకోరు. తాజాగా అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి పెట్టడంతో ఇది అక్రమ నిర్మాణమని తేల్చారు ఇరిగేషన్ అధికారులు. ఇంతకాలం అక్రమ కట్టడం నిర్మించి వాడుకున్నందుకు రాయల్టీ కింద 61.24 కోట్ల రూపాయలు పెనాల్టి విధించింది ప్రభుత్వం.

ఆ మొత్తాన్ని ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ కు కట్టాలని అటు టూరిజం శాఖకు, హోటల్ యజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. అయినా స్పందన రాకపోవడంతో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ద్వారా లీగల్ నోటీసులు పంపించారు ఇరిగేషన్ శాఖ అధికారులు. సర్వే నెంబర్ 234లో 113.14 ఎకరాల చెరువు ఉన్నట్లు రికార్డులు ఉన్నాయి. ఈ భూమిలో 11.05 ఎకరాల స్థలం అన్యాక్రంతమైనట్లు గుర్తించారు. టూరిజం శాఖ అభివృద్ధి కోసం తీసుకుని..లీజ్ కు ఇచ్చినట్లు ఇరిగేషన్ అధికారులు ధృవీకరిస్తున్నారు. పలుమార్లు టూరిజం శాఖ, హోటల్ యజమాన్యానికి నోటీసులు ఇస్తూ వస్తున్నా స్పందించ లేదంటున్నారు ఇరిగేషన్ అధికారులు. ఇంకా ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఎన్ని బయటపడుతాయాన్నది చర్చనీయాంశంగా మారింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories