చనిపోయాడని ఆరేళ్లుగా పిండాలు.. తండ్రి కొడుకులను కలిపిన టిక్ టాక్

చనిపోయాడని ఆరేళ్లుగా పిండాలు.. తండ్రి కొడుకులను కలిపిన టిక్ టాక్
x
చనిపోయాడని ఆరేళ్లుగా పిండాలు.. తండ్రి కొడుకులను కలిపిన టిక్ టాక్
Highlights

టిక్‌టాక్‌ మానియాలో యువత ఊగిపోతోంది. టిక్‌టాక్‌ వీడియోలతో సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయ్యేందుకు నానా పాట్లు పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా పెద్దలు...

టిక్‌టాక్‌ మానియాలో యువత ఊగిపోతోంది. టిక్‌టాక్‌ వీడియోలతో సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయ్యేందుకు నానా పాట్లు పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా పెద్దలు సైతం టిక్‌టాక్‌లు చేస్తూ ఊహా లోకాల్లో తేలిపోతున్నారు. దీనివల్ల వస్తోన్న పాపులార్టీ కంటే చాలా చోట్ల ఎక్కువ అనర్థాలే చోటుచేసుకుంటున్నాయి. అనేక సందర్భాల్లో ప్రాణాలు పోయేంతటి ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి. అనేక కుటుంబాల్లో లేనిపోని సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో మాత్రం ఓ కుటుంబాన్ని కలిపింది. అది ఎలానో తెలియాలంటే స్టోరీలోకి ఎంటర్‌ కావాల్పిందే.

టిక్‌టాక్ ఇప్పుడు ఇది ఇండియాలో ట్రెండింగ్‌లో ఉన్న సోషల్ మీడియా యాప్. దీని ద్వారా షార్ట్ క్లిప్స్ వీడియోలు తీసి అప్‌లోడ్ చేస్తూ అన్ని వయస్సుల వారు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక యువతీయువకులైతే ఈ టిక్‌టాక్‌లో వినూత్న రీతిలో టిక్‌టాక్‌ వీడియోలను చేస్తూ లైక్స్ పొందుతూ ఆనందపడుతుంటారు. ఇప్పటివరకు టిక్‌టాక్‌మోజులో ప్రాణాలు పోయాయి, కాపురాలు కూలిపోయాయి. చదువులు అటకెక్కాయి ఉద్యోగాలు ఊడిపోన్నాయి. లేటెస్ట్‌గా మాత్రం టిక్‌టాక్‌ ఓ కుటుంబాన్ని కలిపి వారి జీవితాల్లో సంతోషాన్ని నింపింది. అయితే టిక్ టాక్ ద్వారా చేడే కాదు అప్పడప్పుడు మంచిపనులు కూడా జరుగుతుంటాయని ఈ ఘటన నిరూపించింది.

కర్నూలు జిల్లా నంద్యాలలోని హరిజనపేటకు చెందిన నరసింహులుకు టిక్‌టాక్‌ చేయడం సరదా. సంతోషం వచ్చినా, బాధకలిగిన టిక్‌టాక్‌ చేసేవాడు. అప్పుడే నరసింహులుకు ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఆరేళ్ల క్రితం కనిపించకుండాపోయిన తండ్రి కోసం చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది.

సంపాదించలేని టైమ్‌లో తండ్రి దగ్గర ఉన్నాడని ఇప్పుడు సంపాదించే టైంలో తండ్రి దూరమవ్వడం బాధగా ఉందని తండ్రిని గుర్తు చేసుకుంటూ పెట్టిన ఫోస్ట్‌ సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టింది. అది అలా తండ్రి వరకు చేరింది. ఇంకేముంది ఆ తండ్రీ కొడుకులను టిక్ టాక్ కలిపేసింది. తండ్రి పుల్లయ్య ఆచూకి దొరికడంతో పట్టరాని సంతోషంలో మునిగితేలాడు. తండ్రి చనిపోయాడని గత ఆరేళ్లుగా కొడుకులు పిండం పెడుతున్నామని ఇప్పుడు తండ్రి ఎక్కడ ఉన్నాడో తెలియడంతో చాలా సంతోషంగా ఉందన్నారు.

అందరూ చనిపోయాడని భావించిన అనుపల్లి పుల్లయ్య గుజరాత్‌లోని గాంధీ ధామ్‌టౌన్‌లోని ఓ బట్టల షాపులు పనిచేస్తున్నాడని తెలుసుకుని కొడుకులు తండ్రి దగ్గరకు వెళ్లి కలుసుకున్నారు. పుల్లయ్య కోసం కుటుంబసభ్యులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో పుల్లయ్య కోసం స్థానికులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు నంద్యాల ప్రజల దృష్టి అంతా పుల్లయ్య ఇంటిపైనే ఉంది. తండ్రి కోసం ఆ యువకుడు వచ్చిన ఐడియాకు రియల్‌ హీరోను చేయడంతో పాటు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories