వుహాన్‌లో చిక్కుకున్న తెలుగమ్మాయి

వుహాన్‌లో చిక్కుకున్న తెలుగమ్మాయి
x
Highlights

కరోనా వైరస్ బారిన పడి చనిపోతున్న మృతల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ వైరస్ ప్రభావంతో ఇప్పటివరకు చైనాలో మరణించిన వారి సంఖ్య 304 కు పెరిగింది.

కరోనా వైరస్ బారిన పడి చనిపోతున్న మృతల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ వైరస్ ప్రభావంతో ఇప్పటివరకు చైనాలో మరణించిన వారి సంఖ్య 304 కు పెరిగింది. అంతేకాదు చైనా మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం, గత 24 గంటల్లో దేశంలో 2 వేలకు పైగా కొత్త కేసులు నమోదయితే ప్రపంచవ్యాప్తంగా మొత్తం 14,380 కు పెరిగింది. కేసుల్లో ఎక్కువ భాగం చైనాలో నమోదయ్యాయి.

ఇక అక్కడే చిక్కుకున్న విదేశీ పర్యాటకులు, పౌరులును తీసుకువచ్చేందుకు భారత్ ప్రత్యేక విమానాలను పంపింది. ఉదయం 324 మందితో కూడిన ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరుకుంది. అయితే, కొద్దిపాటి జ్వరం ఉందన్న కారణంగా ఈ విమానంలో కర్నూలు జిల్లాకు చెందిన అన్నెం శృతి అనే యువతి సహా మరొకరిని ఎక్కించుకోడానికి నిరాకరించారు. దీంతో ఈ ఇద్దరూ వుహాన్‌లోనే ఉండిపోయారు.

శిక్షణ కోసమని మూడు నెలల కింద చైనాకు వచ్చిన శృతికి జ్వరం ఉండడంతో అక్కడి చైనా అధికారులు వెనక్కి రప్పించేందుకు అంగీకరించలేదు. అయితే తనకు కరోనా వైరస్‌ లక్షణాలు లేవని, అధికారులు తనను విమానం ఎక్కేందుకు అనుమతి ఇవ్వలేదంటూ తల్లికి పంపిన వీడియోలో శృతి తన బాధను వ్యక్తం పరిచింది. ఆ వీడియోలో ఆమె తినడానికి ఆహారం, మందులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపైన ఆమె తల్లితండ్రులు తన కూతురును ఎలాగైనా స్వదేశానికి తీసుకురావాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories