Top
logo

వైఎస్ వివేక హత్య కేసులో కీలక పరిణామం.. మాజీ మంత్రికి మరోసారి సిట్ నోటీసులు

వైఎస్ వివేక హత్య కేసులో కీలక పరిణామం.. మాజీ మంత్రికి మరోసారి సిట్ నోటీసులు
Highlights

వివేకా హత్య కేసు విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిని విచారణకు...

వివేకా హత్య కేసు విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిని విచారణకు రావాలంటూ సిట్ గతంలో మూడు సార్లు నోటీసులిచ్చినా ఆయన స్పందించలేదు. ఈ గైర్హాజరీపై సిట్ సీరియస్ గా ఉంది దాంతో మరోసారి నోటీసులిచ్చిన సిట్ ఈసారి ఆయనపై కఠినంగా స్పందించాలని నిర్ణయించుకుంది.

మరోవైపు అజ్ఞాతంలో ఉన్న ఆదినారాయణ రెడ్డి తన లాయర్ తో కలసి సిట్ విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. స్వగ్రామం దేవగుడిలోనూ ఆదినారాయణ రెడ్డి కనిపించకపోవడంతో ఆయనెక్కడున్నారన్నది ప్రశ్నార్ధకంగా మారింది. అయితే ఆదినారాయణ ఢిల్లీలో ఉన్నారన్న పుకార్లు వినిపిస్తున్నాయి.

Web Titlesit notice to adi naryanareddy over ys viveka murder case

లైవ్ టీవి


Share it
Top