వశిష్ట బోటు వెలికితీతకు కీలకంగా మారనున్న స్కాన్ సోనార్..దేశం మొత్తం మీద ఉన్న..

వశిష్ట బోటు వెలికితీతకు కీలకంగా మారనున్న స్కాన్ సోనార్..దేశం మొత్తం మీద ఉన్న..
x
Highlights

గోదావరిలో కచ్చలూరు దగ్గర నదీగర్భంలోకి జారిపోయిన లాంచీని బయటకు తీయడానికి హై ఎండ్ టెక్నాలజీని అధికారులు తెప్పిస్తున్నారు. నదీగర్భంలోకి జారిపోయిన వశిష్ట...

గోదావరిలో కచ్చలూరు దగ్గర నదీగర్భంలోకి జారిపోయిన లాంచీని బయటకు తీయడానికి హై ఎండ్ టెక్నాలజీని అధికారులు తెప్పిస్తున్నారు. నదీగర్భంలోకి జారిపోయిన వశిష్ట బోటు ఎంత లోతులో ఉన్నదీ తెలుసుకోడానికి సైడ్ స్కాన్ సోనార్ పరికరాన్ని వినియోగిస్తారు. ఈ పరికరం ద్వారా నీటి అడుగున ఎంత బురద, మట్టి ఉన్నా నీటిలో ఉన్న వస్తువులను స్కాన్ చేసే వీలుంది. దేశం మొత్తం మీద ఉన్న ఏకైక సైడ్ స్కాన్ సోనర్ పరికరం ఇదే. దీనిని గతంలో ఉత్తరాఖండ్ వరదల్లో వినియోగించారు. రేపటి అన్వేషణ కోసం ఉత్తరాఖండ్ నుంచి దీనిని తెప్పిస్తున్నారు. ఈపరికరం వస్తే బోటు కరెక్ట్ గా ఎంత లోతులో ఉన్నది తేలుతుంది. తద్వారా పైకి తీసే ప్రయత్నాలు ముమ్మరం చేయవచ్చు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories