శ్రీకాకుళం రైల్వేస్టేషన్‌ చేరుకున్న శ్రామిక్‌ రైలు

శ్రీకాకుళం రైల్వేస్టేషన్‌ చేరుకున్న శ్రామిక్‌ రైలు
x
Highlights

వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రత్యేక రైళ్లను...

వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రత్యేక రైళ్లను తిప్పుతున్నారు. తమిళనాడు నుంచి 889 మంది వలస కార్మికులతో శ్రామిక్‌ రైలు మంగళవారం ఉదయం శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. చెన్నై నుంచి వచ్చిన వారిలో 635 మంది మత్స్యకారులున్నారు. పది నెలల క్రితం శ్రీకాకుళం జిల్లా నుంచి మత్స్యకారులు చెన్నై వెళ్లారు.

తమిళనాడు నుంచి వచ్చిన వాళ్లను వైద్య అధికారులు ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తున్నారు. ఇందుకోసం 32 బస్సుల్ని సిద్ధం చేశారు. ఈ బస్సుల్లో సోషల్ డిస్టాన్స్ పాటిస్తూ వలస కూలీలు క్వారంటైన్ కేంద్రం దగ్గరకు చేరుకుంటారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు చేస్తారు. ఎవరికైనా కరోనా పాజిటివ్ అని వస్తే ఐసొలేషన్ కేంద్రానికి తరలిస్తారు. కరోనా లక్షణాలు లేని వారందర్నీ క్వారంటైన్ కేంద్రంలో 14 రోజులు ఉంచుతారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories