అప్పుడలా...ఇప్పుడిలా !!

అప్పుడలా...ఇప్పుడిలా !!
x
Highlights

టీటీడీ పాలక మండలిలో ఏడుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తీర్మానాలను ఆమోదించే సమయంలో వీరికి ఓటు...

టీటీడీ పాలక మండలిలో ఏడుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తీర్మానాలను ఆమోదించే సమయంలో వీరికి ఓటు హక్కు ఉండదని స్పష్టం చేసింది. టీటీడీ మాజీ సభ్యుడుగా ఉన్న శేఖర్ రెడ్డికి ఈసారి కూడా చోటు కల్పించడంపై విమర్శలు పెరుగుతున్నాయి.

రెండు రోజుల క్రితం 29 మందితో జంబో టీటీడీ పాలక మండలిని ప్రకటించిన దేవస్థానం బోర్డు మరో ఏడుగురితో ప్రత్యేక ఆహ్వానితుల జాబితాను వెల్లడించింది. భూమన కరుణాకర రెడ్డి, రాకేష్ సిన్హా, శేఖర్ రెడ్డి, కుపేందర్ రెడ్డి, గోవింద హరి, దుష్మంత్ కుమార్, అమోల్ కాలేను ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రకటిస్తూ జీవో విడుదల చేసింది. వీరందరికీ టీటీడీ ప్రోటోకాల్ వర్తిస్తుందని ప్రకటించింది దేవస్థానం బోర్డు.

అయితే టీటీడీ పాలక మండలిలో మాజీ సభ్యుడుగా ఉన్న శేఖర్ రెడ్డికి ఈసారి కూడా చోటు కల్పించడంపై విమర్శలు పెరుగుతున్నాయి. గతంలో నోట్ల రద్దు సమయంలో తమిళనాడులో శేఖర్ రెడ్డి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడటం సంచలనం కలిగించింది. అప్పట్లో ఈడీ దాడులు జరిగిన వ్యక్తికి పాలక మండలిలో చోటు కల్పించారంటూ వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. అయితే, ఇప్పుడు జగన్ శేఖర్ రెడ్డికి స్థానం ఎలా కల్పిస్తారన్న విమర్శలు రేగుతున్నాయి.

టీటీడీలో మితిమీరిన రాజకీయ జోక్యం పెరుగుతోందన్న విమర్శలు రేగుతున్నాయి. అసలే 29 మందితో జంబో టీం ప్రకటించి అది చాలదన్నట్లు ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో బోర్డులో మరికొందరికి చోటు కల్పించడంపై భక్తుల్లో ఆగ్రహం పెరుగుతోంది. ఈసారి ప్రకటించిన పాలక మండలిలో రాష్ట్రేతరులకే పెద్ద పీట వేసారు. ఇది సంప్రదాయాలను తుంగలో తొక్కడమే అనే విమర్శలు మాజీ ట్రస్టు బోర్డు సభ్యుల నుంచే వస్తున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories