ఫిట్‌నెస్‌ లేని స్కూల్‌ బస్సులపై రవాణాశాఖ కొరఢా

ఫిట్‌నెస్‌ లేని స్కూల్‌ బస్సులపై రవాణాశాఖ కొరఢా
x
Highlights

ఫిట్‌నెస్‌ లేని స్కూల్‌ బస్సులపై రవాణాశాఖ కొరఢా ఝులిపిస్తోంది. నిబంధనలను పాటించకుండా నడుస్తున్న బస్సులను అధికారులు సీజ్‌ చేస్తున్నారు. రెండు...

ఫిట్‌నెస్‌ లేని స్కూల్‌ బస్సులపై రవాణాశాఖ కొరఢా ఝులిపిస్తోంది. నిబంధనలను పాటించకుండా నడుస్తున్న బస్సులను అధికారులు సీజ్‌ చేస్తున్నారు. రెండు రోజుల్లోనే ఏపీలో ఏకంగా 125 బస్సులను స్టేషన్లకు తరలించారు. అర్హత లేకుండా స్కూల్‌ బస్‌లు నడిపితే ఆ పాఠశాల గుర్తింపు రద్దుకు కూడా సిఫారసు చేస్తామని రవాణాశాఖ అధికారులు హెచ్చరించారు.

భద్రతా ప్రమాణాలు పాటించకుండా చిన్నారుల ప్రాణాల మీదికి తెస్తున్న స్కూల్‌ బస్సులపై రవాణశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్కూళ్లు ప్రారంభం కావడంతో అధికారులు ఫిట్‌నెస్‌ లేని బస్సులపై దాడులు చేపడుతున్నారు. రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు ఏపీలో రెండు రోజుల్లోనే 125 బస్సులను సీజ్‌ చేశారు. రాష్ట్రంలో మొత్తం 27 వేల వరకు స్కూల్‌ బస్సులుండగా అందులో 10 వేలకు పైగా ఫిట్‌నెస్‌ లేని బస్సులున్నాయని అధికారులు లెక్కలు తేల్చారు. ఆయా బస్సులకు తక్షణమే ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్లు తెచ్చుకోవాలని మంత్రి పేర్ని నాని ఆదేశించారు. లేకపోతే స్కూల్‌ లేదా కాలేజీల అనుమతులు రద్దు చేసేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తనిఖీలు చేపట్టారు. విశాఖ జిల్లా గాజువాకలో ప్రైవేట్ స్కూల్, కాలేజీ బస్సులపై రవాణాశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పలు పాఠశాలలకు చెందిన స్కూల్ బస్సుల ఫిట్నెస్‌లను చెక్ చేసిన అధికారులు నిబంధలను పాటించని నాలుగు స్కూల్ బస్సుల యజమానులకు జరిమానా విధించారు. అలాగే కర్నూలు జిల్లాలో రవాణాశాఖ అధికారులు స్కూలు బస్సుల పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 200 బస్సులు తనిఖీ చేసిన అధికారులు ఫిట్‌నెస్‌ లేని కార్పొరేట్‌ విద్యాసంస్థల బుస్సులతో పాటు ఇతర విద్యాసంస్థలకు చెందిన 10 బస్సులను సీజ్ చేశారు. తనిఖీలు కొనసాగుతాయని పిల్లలను తరలించే బస్సులకు ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్లు తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories