Satya Kumar: సీఎం జగన్‌ బటన్లు నొక్కి ప్రజలను మోసం చేస్తున్నారు

Satya Kumar: బీజేపీలో చేరిన ల్మీకి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర

Shekhar G
Published on: 14 Feb 2024 7:39 PM IST
Satya Kumar Comments on CM Jagan
X

Satya Kumar: సీఎం జగన్‌ బటన్లు నొక్కి ప్రజలను మోసం చేస్తున్నారు

Satya Kumar: వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ ఫైరయ్యారు. ప్రధాని మోడీ అనేక సంక్షేమ పథకాలను అందిస్తుంటే.. సీఎం జగన్‌ బటన్లు నొక్కి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కేంద్రం పేదల ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇస్తుంటే .. అది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లు దొంగ ప్రచారం చేస్తుందని సత్యకుమార్‌ మండిపడ్డారు. అవినీతి రహిత పాలన అందిస్తున్న బీజేపీని ప్రజలు ఆదరించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో సత్యకుమార్‌ సమక్షంలో వాల్మీకి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర బీజేపీలో చేరారు.

Shekhar G

Shekhar G

Next Story