టీ కాంగ్రెస్ సమావేశంలో రచ్చ..మైక్ ను లాగేసిన జగ్గారెడ్డి

టీ కాంగ్రెస్ సమావేశంలో రచ్చ..మైక్ ను లాగేసిన జగ్గారెడ్డి
x
Highlights

కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య మరోసారి విభేదాలు బయటకు వచ్చాయి. నాగార్జునసాగర్ వేదికగా జరిగిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్యే...

కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య మరోసారి విభేదాలు బయటకు వచ్చాయి. నాగార్జునసాగర్ వేదికగా జరిగిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఇది ప్రస్తుతం పార్టీలో హాట్ టాపిక్ అయ్యింది.

మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు పలు అంశాలపై చర్చించేందుకు నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలకు ఇంచార్జీలను నియమించాలని పార్టీ నాయకత్వం భావించింది. ఇదే విషయాన్ని పార్టీ సీనియర్లు సమావేశంలో ప్రస్తావించారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసిన నేతలు, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను ఇంచార్జ్ లుగా కొనసాగించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రతిపాదించారు. కానీ దానిని కొందరు సీనియర్లు వ్యతిరేకించారు. దీంతో జగ్గారెడ్డి పార్టీ నాయకత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్ విసిరేసిన తన అసంతృప్తిని తెలియజేశారు.

సమావేశం నుంచి జగ్గారెడ్డి వెళ్లిన తర్వాత పలు అంశాలపై నేతలంతా చర్చించారు. సమావేశపు వివరాలను టీపీసీపీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి మీడియాకు వివరించారు. కేసీఆర్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జైల్‌ భరో కార్యక్రమం చేపడతామని ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తెలిపారు. అదే విధంగా రాహుల్ గాంధీ అధ్యక్షునిగా కొనసాగాలని కోరుతూ తీర్మానం చేసి పంపిస్తామని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల మాట అటుంచి పార్టీలోని నేతలు ఇలా తరచూ కొట్లాటలకు దిగుతుంటే , ప్రతి దానికి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటే ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories