విజయనగరంలో మూడు లాంతర్ల స్తంభం పునః ప్రతిష్ట

విజయనగరంలో మూడు లాంతర్ల స్తంభం పునః ప్రతిష్ట
x
Highlights

విజయనగరంలో చారిత్రాత్మక మూడు లాంతర్ల స్తంభాన్ని కూల్చివేతపై ఇటీవల వివాదం జరిగిన సంగతి తెలిసింది. స్థూపాన్ని ప్రభుత్వం అకారణంగా కూల్చివేసిందని...

విజయనగరంలో చారిత్రాత్మక మూడు లాంతర్ల స్తంభాన్ని కూల్చివేతపై ఇటీవల వివాదం జరిగిన సంగతి తెలిసింది. స్థూపాన్ని ప్రభుత్వం అకారణంగా కూల్చివేసిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఆ స్థూపాన్ని మళ్లీ ఏర్పాటు చేస్తామని క్లారిటీ ఇచ్చింది. మళ్లీ ఆ మూడు లాంతర్ల స్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌ సంచయిత గజపతిరాజు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు.

మూడు లాంతర్ల స్తూపాన్ని కూల్చేశారంటూ అశోక్‌ గజపతి రాజు గారు, చంద్రబాబు గారు విష ప్రచారం చేశారు. నిజాలు వారివైపు లేనప్పుడు వాళ్లు ఇలానే ప్రవర్తిస్తారు. ఇప్పుడు అదే మూడులాంతర్ల స్తూపాన్ని తిరిగి అదే ప్రాంతంలో నిలబెట్టాం' అని చెప్పారు.

'పూసపాటి వంశం పేరును అశోక్‌ గజపతి రాజు గారు కేవలం రాజకీయాలకు మాత్రమే వాడుకుంటారు. వారసత్వపు హక్కులకోసం పోరాడుతున్న ఒక యువతిపైన తాను దాడిచేయడమే కాదు.. టీడీపీతోనూ చేయిస్తున్నారు. అయినా అంతిమంగా గెలిచేది సత్యమే' అని సంచయిత చెప్పారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories