Top
logo

కోడెల ఇంట్లో దొంగతనంపై విచారణ ముమ్మరం

కోడెల ఇంట్లో దొంగతనంపై విచారణ ముమ్మరం
Highlights

కోడెల ఇంట్లో దొంగతనంపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. విద్యుత్ పునరుద్ధరణ కోసం ఇంటికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఎవరనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

కోడెల ఇంట్లో దొంగతనంపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. విద్యుత్ పునరుద్ధరణ కోసం ఇంటికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఎవరనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కోడెల ఇంట్లో ఉన్న అసెంబ్లీ ఫర్నిచర్‌ను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు వస్తున్న సమయంలో చోరి జరగడాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. కోడెల ఇంట్లోని వాచ్‌మెన్‌ను ప్రశ్నించిన పోలీసులు కంప్యూటర్ బాయ్ ఫోన్ చేస్తేనే ఇద్దరు వ్యక్తులు విద్యుత్ పునరుద్దరణకు వచ్చారని చెబుతున్నాడు. రెండు కంప్యూటర్లతో పరారయ్యేందుకు ప్రయత్నించగా తాను గుర్తించడంతో ఒక కంప్యూటర్ అక్కడే పడేసి వెళ్లిపోయారని పోలీసులకు తెలియజేశాడు.

Next Story