Top
logo

అర్థరాత్రి కోడెల ఇంట్లో దొంగతనం..

అర్థరాత్రి  కోడెల ఇంట్లో దొంగతనం..
Highlights

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇంట్లో చోరీ జరిగింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని కోడెల నివాసంలో కరెంట్ పనికి సంబంధించి రిపేర్ చేసేదుందంటూ అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు.

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇంట్లో చోరీ జరిగింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని కోడెల నివాసంలో కరెంట్ పనికి సంబంధించి రిపేర్ చేసేదుందంటూ అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు. అనంతరం ఇంట్లోని కంప్యూటర్లను ఎత్తుకెళ్లారు. గేట్ వద్ద ఉన్న వాచ్‌మెన్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వాచ్‌మెన్‌పై దాడి చేసి కంప్యూటర్లతో జంప్ అయ్యారు. కాగా, ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. కోడెలకు కూడా సమాచారం ఇచ్చినట్లు ఆ నివాసం వద్ద ఉన్న సిబ్బంది తెలిపారు. కాగా మరికాసేపట్లో కోడెల తన నివాసానికి చేరుకోనున్నారు. ఇక మరోవైపు నేడు అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు విషయంలో పోలీసులు కోడెల ఇంటికిరానున్నారు. మరికొద్ది గంటల్లో స్థానిక పోలీసులు సోదాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోడెల ఇంట్లో దొంగతనం జరడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story