Top
logo

కో ఆపరేటివ్ బ్యాంక్‌లో భారీ చోరీ..స్లాబ్‌ పగులగొట్టి..

కో ఆపరేటివ్ బ్యాంక్‌లో భారీ చోరీ..స్లాబ్‌ పగులగొట్టి..
X
Highlights

అనంతపురం కో ఆపరేటీవ్‌ బ్యాంక్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. బ్యాంక్‌ పైన రూఫ్‌ను తొలగించి లోనికి చొరబడ్డ...

అనంతపురం కో ఆపరేటీవ్‌ బ్యాంక్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. బ్యాంక్‌ పైన రూఫ్‌ను తొలగించి లోనికి చొరబడ్డ దొంగలు రెండు ప్రైవేటు లాకర్లను తెరిచి అందులో ఉన్న దాదాపు 40 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకున్నారు. 11, 16 నెంబర్‌ గల లాకర్లను తెరచిన దొంగలు మెయిన్‌ లాకర్‌ను కూడా తెరిచేందుకు ప్రయత్నించారు. అయితే లాకర్‌ తెరుచుకోకపోవడంతో వెళ్లిపోయారు. ఇటు సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీ చేపట్టారు. పక్కాగా లోనికి ప్రవేశించి దొంగతనం చేయడంపై పోలీసులు అనుమానిస్తున్నారు. త్వరలోనే చోరీపై పూర్తి వివరాలు రాబడతామని స్పష్టం చేశారు.

Next Story