పోలవరం రివర్స్ టెండరింగ్ గ్రాండ్ సక్సెస్..ఆదా అయ్యింది ఎంతో తెలుసా?

పోలవరం రివర్స్ టెండరింగ్ గ్రాండ్ సక్సెస్..ఆదా అయ్యింది ఎంతో తెలుసా?
x
Highlights

పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టులపై రివర్స్ టెండరింగ్ కు వెలతామన్న ఏపీ సర్కార్ చివరకు ఆ విషయంలో విజయం సాధించింది. ప్రాజెక్టులోని లెఫ్ట్ కనెక్టివిటీ...

పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టులపై రివర్స్ టెండరింగ్ కు వెలతామన్న ఏపీ సర్కార్ చివరకు ఆ విషయంలో విజయం సాధించింది. ప్రాజెక్టులోని లెఫ్ట్ కనెక్టివిటీ పనులకు సంబంధించిన 65వ ప్యాకేజీ పనికి టెండర్లు పిలిచిన సర్కార్ అందరికన్నా తక్కువ అంచనా వ్యయం కోట్ చేసిన మాక్స్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కు టెండర్ ఖరారు చేసింది. ఈ కంపెనీ అందరికన్నా తక్కువగా అంటే 15.6 శాతం తక్కువకు కోట్ చేసింది. మొత్తం పని విలువలో 43కోట్లు తక్కువకు కోట్ చేసిన హైదరాబాద్ కు చెందిన మాక్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ కంపెనీ ఈ టెండర్ దక్కించుకుంది.

ఈ రివర్స్ టెండరింగ్ లో మొత్తం ఆరు కంపెనీలు పాల్గొన్నాయి. గతంలో ఇదే పనిని టీడీపీ సర్కార్ 290 కోట్లకు ప్యాకేజీ ఇవ్వగా ప్రస్తుత ప్రభుత్వం 260 కోట్లకు ప్యాకేజీ ఇచ్చింది. చిత్రమేంటంటే గతంలోకూడా ఇదే కంపెనీ ఇదే కాంట్రాక్టును ఎక్కువకు కోట్ చేసి తీసుకుంది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రభుత్వానికి 43 కోట్ల మేర ఆదాయం మిగిలినట్లు తెలుస్తోంది. ఈ పనుల ప్రస్తుత విలువ లెక్కిస్తే రాష్ట్ర ఖజానాకు దాదాపు 58 కోట్లు సొమ్ము మిగిలింది.

పోలవరంపై రివర్స్ టెండరింగ్ మంచిది కాదంటూ అటు నిపుణులూ, ఇటు పార్టీలు వారించినా జగన్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కే మొగ్గు చూపింది. ప్రాజెక్టు మొత్తం కాకుండా, ఇప్పటి వరకూ పూర్తి కాని ,ఇంకా పనులు ఆరంభం కాని టెండర్లను రద్దు చేసింది పోలవరం 65వ ప్యాకేజీ రివర్స్ టెండరింగ్ ద్వారా ఖజానాకు సొమ్ము మిగలడంతో ఏపీ సర్కార్ సంతోషంలో ఉంది ఈ మిగిలిన సొమ్మును రాష్ట్ర ఖజానాకు జమ చేస్తామని, అవసరమైన పనులకు వినియోగిస్తామనీ జగన్ మొదట్నుంచీ చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు రివర్స్ టెండరింగ్ తో టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందన్న విషయం స్పష్టమైందని వైసీపీ నేతలంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories