పందాలతో పాటు జోరుగా రికార్డింగ్ డ్యాన్సులు

పందాలతో పాటు జోరుగా రికార్డింగ్ డ్యాన్సులు
x
కోడిపందాలతో రికార్డింగ్ డ్యాన్సులు
Highlights

సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో కోడి పందాలతో పాటు రికార్డింగ్ డ్యాన్సులు జోరుగా సాగుతున్నాయి. యువతుల డ్యాన్సులను...

సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో కోడి పందాలతో పాటు రికార్డింగ్ డ్యాన్సులు జోరుగా సాగుతున్నాయి. యువతుల డ్యాన్సులను చూసేందుకు జనం ఎగబడ్డారు. రికార్డింగ్ డ్యాన్సులపై పోలీసులు దృష్టి సారించడం లేదు.

కోస్తా జిల్లాల్లో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి రూరల్, గోకవరం ఆత్రేయపురంతో పాటు పలుప్రాంతాల్లో విచ్చలవిడిగా పందాలు ఆడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్లా బరులు ఏర్పాటు చేసి కోడి పందాలు కడుతున్నారు. కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో జోరుగా పందాలు జరుగుతున్నాయి.

కోడి పందాలు జరిగే ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉందని నిర్వాహకులపై కేసులు పెడుతామన్న అధికారుల హెచ్చరికలు మాటలకే పరిమితం అయ్యాయి. పందెంరాయుళ్లు నేతల అండదండలతో యథేచ్చగా పందాలు నిర్వహిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలి వచ్చిన పందెంరాయుళ్లు కూడా పందేలు కాస్తున్నారు. కనుచూపు మరలో పోలీసులు కనిపించకపోవడంతో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. స్వయానా పార్టీ నేతలే కోడి పందాలు సాంప్రదాయమని ధనార్జన కోసం కాదని చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories