దొనకొండలో రియల్ బూమ్.. ఒక్కసారిగా పెరిగిన...

దొనకొండలో రియల్ బూమ్.. ఒక్కసారిగా పెరిగిన...
x
Highlights

రాజధాని వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఇటీవల బొత్స వ్యాఖ్యలు, అనంతరం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే రాజధాని మార్చే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

రాజధాని వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఇటీవల బొత్స వ్యాఖ్యలు, అనంతరం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే రాజధాని మార్చే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఏపీ కొత్త రాజధాని ఏది అనే అంశం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఈ నేపధ్యంలో ఏపీ రాజధాని ప్రకాశం జిల్లా దొనకొండలో నిర్మిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి దొనకొండ అనేది ఓ చిన్న ఊరు. అయితే అక్కడ రైతులకు మాత్రం ఈ విషయాలు ఏవీ తెలియవు తమ పనులు తాము చేసుకుంటున్నారు. కానీ దొనకొండను రాజధాని చేస్తారనే వార్త రాజకీయంగా రగడ రేగడమే కాదు దొనకొండపై చర్చ జరిగేలా చేస్తోంది. మరోవైపు అక్కడి భూములకు కృత్రిమ రేటు పెరిగేలా, రియల్టర్లు అక్కడ వాలిపోయేలా, రాత్రికి రాత్రి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఊపందుకునేలా చేసింది.

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ దొనకొండ చుట్టూ భూముల కొనుగోళ్లు పెరిగాయి. ఎవరెవరో ఆ ఊరికి రావడం. పంట పొలాల్నీ, ఖాళీ స్థలాల్నీ కొనుక్కోవడం వంటివి చాలా జరిగాయి. అయితే రాజధాని అవుతుందనే ఉద్దేశంతోనే ఈ కొనుగోళ్లు జరుగుతున్నాయని చాలా మందికి తెలియదు. ఇప్పుడు తాజా పరిణామాలతో ఆ కొనుగోళ్ల వెనక ఈ రాజకీయ ఎత్తుగడ ఉండి ఉండొచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories