ఆల్‌టైం రికార్డ్ సాధించిన వైసీపీ సాంగ్..

ఆల్‌టైం రికార్డ్ సాధించిన వైసీపీ సాంగ్..
x
Highlights

సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ గెలుపును కాంక్షిస్తూ ఆ పార్టీ విడుదల చేసిన 'రావాలి జగన్‌.. కావాలి జగన్‌' ప్రచార గీతం సామాజిక మాధ్యమాల్లో...

సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ గెలుపును కాంక్షిస్తూ ఆ పార్టీ విడుదల చేసిన 'రావాలి జగన్‌.. కావాలి జగన్‌' ప్రచార గీతం సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించింది. యూట్యూబ్ లో ఆ పాటను విన్న,చూసిన వారి సంఖ్య ఇప్పటివరకు 68 లక్షలు దాటింది. అంతేకాదు అన్ని విభాగాల్లో(మిగిలిన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్)ను కలుపుకుంటే ఈ పాటను కోటి మందికి పైగానే వీక్షించినట్టు తెలుస్తోంది.

దేశ రాజకీయ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ ప్రచారగీతం ఈ స్థాయిలో ప్రజాధారణ పొందడం ఆల్‌టైం రికార్డ్. ఈ గీతాన్ని ప్రముఖ సినీ రచయిత సుద్దాల అశోక్‌తేజ రచించారు. ఈ పాటకు ఫిదా చిత్ర సంగీత దర్శకుడు శక్తికాంత్‌ కార్తీక్‌ సంగీతం సమకూర్చగా.. గాయకుడు మనో ఆలపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories