ప్రమాదాన్ని సినిమా సెట్టింగ్ అనుకుని..

ప్రమాదాన్ని సినిమా సెట్టింగ్ అనుకుని..
x
Highlights

సేల్ఫీ మోజు.. సోషల్ మీడియాలో మెరిసిపోవాలనే ఆలోచనా.. నిజానిజాల్ని తెలుసుకునే అవకాశం జనానికి ఇవ్వడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగినా దానిని ఫోటోలు తీసి...

సేల్ఫీ మోజు.. సోషల్ మీడియాలో మెరిసిపోవాలనే ఆలోచనా.. నిజానిజాల్ని తెలుసుకునే అవకాశం జనానికి ఇవ్వడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగినా దానిని ఫోటోలు తీసి ప్రచారం చేయడానికి ఇస్తున్న ప్రాధాన్యం ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించడానికి ఇవ్వడం లేదన్నది నిష్టుర సత్యం. సంఘటన ఏదైనా కానీ, వెంటనే ప్రపంచంతో పంచేసుకోవాలనే ఆలోచనే తప్ప దానిలో విషయం ఏమిటనేది పూర్తిగా అవగాహన కలిగించుకోవడానికి ఎవరూ ప్రయత్నించడం లేదు. ముఖ్యంగా సేల్ఫీల విషయంలో అయితే పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఏదన్నా వింతగా కనిపిస్తే చాలు దాని దగ్గర సేల్ఫీ దిగిపోవాలనే ఆరాటమే ఎక్కువగా ఉంది ఈతరానికి.

సరిగ్గా అదిగో అలాంటి ఆరాటమే ఇది. విజయవాడ రామవరప్పాడు రింగు రోడ్డులో ఓ కారు వేగంగా వెళుతూ అదుపు తప్పింది. పక్కనే ఉన్న గోడపైకి ఎక్కి ఆగిపోయింది. అయితే, అది చూడటానికి గోడ మీద నుంచి గాల్లోకి వేలాడుతున్నట్టుగా కనిపించింది. ఇంకేముంది.. అది సినిమా షూటింగ్ కోసం వేసిన సెట్టింగ్ అనుకుని జనం సేల్ఫీలు దిగడం మొదలు పెట్టారు. అటు, ఇటు వెళుతున్నవారు ఆగి అక్కడ సేల్ఫీలు దిగుతున్నారు. ఈ హడావుడికి ట్రాఫిక్ జాం అవుతుండడం తో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పుడు తెలిసింది అది ప్రమాదమని. అదృష్టవశాత్తూ కారులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి ప్రమాదమూ జరగకుండా బయటపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories