విశాఖ రైల్వే స్టేషన్‌లో సెగ్‌వే పరుగులు

విశాఖ రైల్వే స్టేషన్‌లో సెగ్‌వే పరుగులు
x
Highlights

రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫాంపై పరుగులు పెట్టాల్సిన పని లేదు. గస్తీ కాసేందుకు కాళ్లు నొప్పి పుట్టేలా తిరగాల్సిన అవసరం లేదు. స్టేషన్‌లో ఎక్కడికైనా 2...

రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫాంపై పరుగులు పెట్టాల్సిన పని లేదు. గస్తీ కాసేందుకు కాళ్లు నొప్పి పుట్టేలా తిరగాల్సిన అవసరం లేదు. స్టేషన్‌లో ఎక్కడికైనా 2 నిమిషాల్లో చేరుకునే సౌలభ్యం. విశాఖ రైల్వే పోలీసుల డ్యూటీని సులభం చేసిన సాధనం. ఇంతకీ ఏంటది..? రైల్వే పోలీసులకు ఎలా ఉపయోగపడుతోంది..? అదే చూద్దాం ఇప్పుడు.

మీరు చూస్తున్న ఈ సాధనం పేరు సెగ్‌వే. విశాఖ రైల్వే స్టేషన్‌లో కొత్తగా దీని సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్లాట్‌ఫాంపై ఏ చోటికైనా 2 నిమిషాల్లో దీనిపై రయ్ రయ్‌మంటూ చేరుకోవచ్చు.దేశంలో ముంబై, అహ్మదాబాద్ తర్వాత విశాఖలోనే సెగ్‌వే సేవలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో మరికొన్ని రైల్వే స్టేషన్లలో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. రైల్వే స్టేషన్‌లో గస్తీ కాసేందుకు ఇబ్బందులు లేకుండా దీనిపై నిమిషాల్లోనే ఎక్కడికైనా చేరుకోవచ్చు. పైగా వేగవంతమైన సేవలు అందుతాయని రైల్వే పోలీసులు చెబుతున్నారు.

విశాఖ రైల్వే స్టేషన్‌లోని ఫ్లాట్ ఫామ్స్‌పై పరుగులు పెడుతున్న సెగ్‌వేలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రైల్వే పోలీసులు వీటిపై తిరుగుతూ గస్తీ కాస్తున్నారు. ప్రయాణికులు సైతం వీటిని చూసి ఔరా అనుకుంటున్నారు. రైల్వే స్టేషన్‌లో అటూ ఇటూ తిరగడం వల్ల గతంలో కాళ్లు నొప్పులు పుట్టేవి. అయితే ఇప్పుడు సెగ్‌వేల చలువతో ఆ బాధలు తప్పాయి. పైగా మెరుగైన సేవలు అందించగలుగుతున్నామని అంటున్నారు రైల్వే పోలీసులు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories