Top
logo

మామిడి తోటలో కాలేజీ స్టూడెంట్స్.. గుట్టు రట్టు చేసిన పోలీసులు

మామిడి తోటలో కాలేజీ స్టూడెంట్స్.. గుట్టు రట్టు చేసిన పోలీసులు
X
Highlights

శ్రీకాకుళం జిల్లాలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. నరసన్నపేట మండలం తామరాపల్లి ...

శ్రీకాకుళం జిల్లాలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. నరసన్నపేట మండలం తామరాపల్లి సమీపంలోని ఓ మామిడి తోటలో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వ్యభిచారం చేస్తున్న ముగ్గురు మహిళలతో పాటు 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో ఎక్కువమంది విద్యార్థులు ఉండడం విశేషం. గతకొంత కాలంగా నరసన్నపేటలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వేళల్లో వ్యభిచారం జరుతోందని దీనిపై తమకు వచ్చిన సమాచారంతో ఈ దాడులు నిర్వహించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. అయితే మామిడి తోటల్లో ఈ వ్యవహారం ఎప్పటినుంచి కొనసాగుతోంది? దీని వెనకాల ఎవరున్నారు? అన్న కోణంలో ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Next Story