Visakhapatnam: విశాఖ మెట్రో ప్రాజెక్ట్‌లో పురోగతి

Visakhapatnam: విశాఖ మెట్రో ప్రాజెక్ట్‌లో పురోగతి
x
Highlights

విశాఖ మైట్రోకు మంచి రోజులు వచ్చాయి. అనకాపల్లి నుంచి భోగాపురం వరకు మెట్రో పరుగులు పెట్టనుంది.140 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రాజెక్ట్ కు సర్కార్ గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది.

విశాఖ మైట్రోకు మంచి రోజులు వచ్చాయి. అనకాపల్లి నుంచి భోగాపురం వరకు మెట్రో పరుగులు పెట్టనుంది.140 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రాజెక్ట్ కు సర్కార్ గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విశాఖపట్నం వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. విశాఖలో మెట్రో రైలుకు సీఎం జగన్ అనుమతిచ్చారు. కొన్ని సూచనలు చేశారు.

మొత్తం 10 విడతల్లో 10 కారిడార్లలో 140.13 కిలోమీటర్లలో మెట్రో ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేయబోతున్నారు. ఫస్ట్ పేస్ లో 46.40 కిలోమీటర్లు, స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.23 కిలోమీటర్లు, గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు 5.26 కిలోమీటర్లు, తాడిచెట్ల పాలెం నుంచి ఆర్కే బీచ్ వరకు 6.91 కిలోమీటర్లు మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు.

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్ ను 2020 నుంచి 2024 మధ్య పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే వివిధ రకాల డిజైన్లను పరిశీలించి, డీపీఆర్ కూడా తయారుచేస్తున్నారు. విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం..ఇప్పుడు మెట్రో రైలు ప్రాజెక్ట్ ను వేగంగా ముందు తీసుకెళ్లడంపై వైజాగ్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories