Top
logo

డేంజర్ లో ప్రకాశం బ్యారేజ్

డేంజర్ లో ప్రకాశం బ్యారేజ్
Highlights

విజయవాడ ప్రకాశం బ్యారేజీ ప్రమాదకర స్థితిలో ఉండటంతో బ్యారేజీపై ఆంక్షలు విధించారు. బ్యారేజీపై హెవీ వెహెకల్స్...

విజయవాడ ప్రకాశం బ్యారేజీ ప్రమాదకర స్థితిలో ఉండటంతో బ్యారేజీపై ఆంక్షలు విధించారు. బ్యారేజీపై హెవీ వెహెకల్స్ వెళ్లవద్దంటూ ప్రభుత్వం ఫెక్సీలను ఏర్పాటు చేసింది. బ్యారేజీని చూసేందుకు భారీగా జనం వస్తున్నారు. దీంతో బ్యారేజీపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా అధికారులు ఫెక్సీలను ఏర్పాటు చేశారు.

ఎగువ ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు రావడంతో బ్యారేజీ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజీ దగ్గర కృష్ణమ్మ పరవళ్లను చూసేందుకు సందర్శకులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. సందర్శకుల తాకిడి పెరగడంతో ప్రకాశం బ్యారేజీ ప్రస్తుత క్యాపాసిటిని దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం ఫెక్సీలను ఏర్పాటు చేశారు.

Next Story

లైవ్ టీవి


Share it