logo

ప్రజా వేదిక కూల్చివేతకు రంగం సిద్ధం

ప్రజా వేదిక కూల్చివేతకు రంగం సిద్ధం
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రజా వేదిక కూల్చివేతకు రంగం సిద్దమైంది. కలెక్టర్ల సదస్సు ముగియగానే కూల్చి...

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రజా వేదిక కూల్చివేతకు రంగం సిద్దమైంది. కలెక్టర్ల సదస్సు ముగియగానే కూల్చి వేసేందుకు రెవిన్యూ అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే CRDAకు సమాచారమిచ్చని రెవిన్యూ శాఖ అధికారులు కలెక్టర్ల సదస్సు జరుగుతున్న హాల్ మినహా మిగిలిన చోట్లను ఖాళీ చేయించారు. కలెక్టర్ల సదస్సు ముగియగానే ఫర్నిచర్‌కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా భారీగా పోలీసులను మోహరించారు. సమావేశాల నిర్వహణ కోసం అమరావతిలో మరో వేదికను నిర్మించే యోచనలో ఉన్నారు. జగన్ ఆమోదం తెలిపిన తర్వాత కొత్త వేదికను నిర్మించాలని నిర్ణయించారు.


లైవ్ టీవి


Share it
Top