పల్నాడులో గొడవ చేస్తే ఇక దరువే

పల్నాడులో గొడవ చేస్తే ఇక దరువే
x
Highlights

పల్నాడులో రాజకీయ దాడులపై టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దాడులు, గూండాయిజం...

పల్నాడులో రాజకీయ దాడులపై టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దాడులు, గూండాయిజం పెరిగిపోయిందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తుంటే టీడీపీ వాళ్లే దాడులు చేస్తూ తిరిగి వైసీపీపై విమర్శలు చేస్తున్నారంటూ హోంమంత్రి సుచరిత కౌంటర్ ఇచ్చారు.

పల్నాడులో ఇప్పుడు కొత్త యుద్ధం నడుస్తోంది. అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ కత్తులు దూసుకుంటున్నాయి. రాజకీయ దాడులపై మాటల తూటాలు విసురుకుంటున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో నిప్పులు కక్కుతున్నారు.

వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దాడులు, గూండాయిజం పెరిగిపోయిందని టీడీపీ నేతలు ఆరోపించారు. తెలుగుదేశం పునరావాస కేంద్రంలో బాధితులను పరామర్శించిన టీడీపీ లీడర్లు జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

తెలుగుదేశం ఆరోపణలపై హోంమంత్రి సుచరిత ఘాటుగా స్పందించారు. టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పల్నాడు ప్రశాంతంగా ఉందని, ఆ ప్రశాంతతకు ఎవరూ భంగం కలిగించొద్దని సూచించారు. పెయిడ్‌ ఆర్టిస్టులతో టీడీపీ పునరావాస కేంద్రాలు నిర్వహిస్తోందన్న సుచరిత అసలక్కడ నిజంగా బాధితులు ఉన్నారో లేదో తెలుసుకునేందుకు నిజనిర్ధారణతోపాటు సమగ్ర విచారణ చేపడతామని ప్రకటించారు.

టీడీపీ ఛలో ఆత్మకూరుకు అనుమతి లేదన్న హోంమంత్రి సుచరిత ఎవరైనా శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ పునరావాస కేంద్రాల్లో నిజంగానే బాధితులు ఉంటే, పోలీసులే వారిని స్వయంగా గ్రామాలకు తీసుకెళ్లి రక్షణ కల్పిస్తారని హోంమంత్రి హామీ ఇచ్చారు. పల్నాడులో 144 సెక్షన్ అమల్లో ఉందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. పల్నాడులో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయన్న డీజీపీ బయటివాళ్లు ఎవరైనా ఉద్రిక్తతలు సృష్టించాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories