జషిత్ కిడ్నాప్ కథ సుఖాంతం..

జషిత్ కిడ్నాప్ కథ సుఖాంతం..
x
Highlights

జషిత్ కిడ్నాప్ మిస్టరీ వీడింది. ఈనెల 23న తూర్పుగోదావరి జిల్లా మండపేటలో కిడ్నాప్ కు గురైన జషిత్ కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. 3 రోజుల క్రితం మండపేటలో...

జషిత్ కిడ్నాప్ మిస్టరీ వీడింది. ఈనెల 23న తూర్పుగోదావరి జిల్లా మండపేటలో కిడ్నాప్ కు గురైన జషిత్ కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. 3 రోజుల క్రితం మండపేటలో బాలుడు కిడ్నాప్ అయన జషిత్‌ను కుతుకూలూరు వద్ద వదిలివెళ్లారు కిడ్నాపర్లు. కాగా జషిత్‌ను గుర్తించిన కూలీలు వెంటనే ఆలస్యం చేయ్యకుండా జషిత్ జాడ గురించి పోలీసులకు సమాచారం అందించారు. కిడ్నాప్ అయిన జషిత్ క్షేమంగా ఉన్నట్లు నిర్థారించారు పోలీసులు. అయితే ఈ తెల్లవారు జామునా బాలుడిని వదిలివేసి వెళ్లినట్లు చెప్పారు అక్కడి కూలీలు.

బాలుడి కోసం పదిహేడు పోలీసులు బృందాలు రాత్రింబవళ్లూ జల్లెడ పట్టాయి. ఇటు వేలాది మంది నెట్‌జన్లు సోషల్‌మీడియాలో బాబు ఫొటో షేర్‌ చేస్తూ తమ వంతుగా సహకరించారు. ఇక మొత్తానికి జషిత్‌ క్షేమంగా బయటపడడంతో తల్లిదండ్రుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. తమ బిడ్డ జాడ తెలియగానే ఒక్కసారి భావోద్వేగానికి గురయ్యారు. మూడు రోజుల నుంచి కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న బిడ్డ దొరికాడంటూ సమాచారం వచ్చింది. అంతే ఒక్కసారిగా ఆ తల్లి కన్నీళ్లు ఆనందభాష్పాలుగా మారాయి. ఎస్పీ చేతిలో ఉన్న జషిత్‌ను చూడగానే తల్లి నాగావళి ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది. తన బిడ్డ దొరికాడన్న ఆనందంతో ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ రెండు చేతులు జోడించి ఎస్పీకి కృతజ్ఞతలు తెలియజేసింది. బిడ్డను ఒక్కసారిగా హత్తుకుని ముద్దులు పెట్టి కన్న ప్రేమ అందిస్తూ మురిసిపోయింది. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డను తన చెంతకు చేర్చిన పోలీసులు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపింది.మొత్తానికి జషిత్ జాడ లభ్యం కావడంతో పోలీసులు, అటు నెటిజన్లు, తలిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories