నిఘా వర్గాల హెచ్చరికలతో చిత్తూరులో కార్డాన్ సెర్చ్

నిఘా వర్గాల హెచ్చరికలతో చిత్తూరులో కార్డాన్ సెర్చ్
x
Highlights

దేశంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారన్న నిఘా వర్గాల హెచ్చరికలు భక్తులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. కశ్మీర్, ఢిల్లీ, కొయంబత్తూరులోకి ఉగ్రవాదులు చొరబడ్డారన్న ఐదు హెచ్చరికలతో చిత్తూరు జిల్లా పోలీసులు అలర్టు అయ్యారు.

దేశంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారన్న నిఘా వర్గాల హెచ్చరికలు భక్తులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. కశ్మీర్, ఢిల్లీ, కొయంబత్తూరులోకి ఉగ్రవాదులు చొరబడ్డారన్న ఐదు హెచ్చరికలతో చిత్తూరు జిల్లా పోలీసులు అలర్టు అయ్యారు. మారువేషాల్లో భక్తులులా.. ఉగ్రవాదులు.. ప్రవేశించారన్న అనుమానాలతో ఇటు తిరుపతి, అటు శ్రీకాళహస్తి ఆలయాలకు వెళ్లే వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పాక్ ఐఎస్ఐ ప్రోత్సాహంతో జైషే మహ్మద్ ఉగ్రవాదులు నలుగురు రాజస్థాన్, గుజరాత్ మీదుగా దేశంలోకి చొరబడ్డారన్న హెచ్చరికలున్నాయి. లష్కరే తోయిబాకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు శ్రీలంక మీదుగా తమిళనాడులోని కొయంబత్తూరులోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు పదే పదే హెచ్చరిస్తున్నాయి. ఆ ఉగ్రవాదులు అక్కడే ఉన్నారా? లేకపోతే ఏపీలోకి ప్రవేశించారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

నిఘా వర్గాల హెచ్చరికలతో చిత్తూరు జిల్లా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. తనిఖీలు ముమ్మరం చేశారు. పుత్తూరు మున్సిపాల్టీలో కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. పుత్తూరులో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. కొత్తగా ఎవరైనా వచ్చారా? అని ఇంటింటికి తిరిగి ప్రశ్నిస్తున్నారు. వాహనాల ధృవీకరణ పత్రాలను పరిశీలిస్తున్నారు. 2013 అక్టోబర్ 5న గేట్ పుత్తూరులో ఉగ్రవాదులు పట్టుబడ్డారు. దీంతో పుత్తూరులో జల్లెడ పడుతున్నారు. గేట్ పుత్తూరును కట్టడి ముట్టడి చేసిన పోలీసులు సరైన ధృవీకరణ పత్రాలు లేని 28 ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలను సీజ్ చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories