logo

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి రూ.10 వేల పెన్షన్

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి రూ.10 వేల పెన్షన్

అమరావతి: టెండర్ల ప్రక్షాళనకు జ్యుడీషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేయనున్నట్టు గవర్నర్‌ నరసింహన్ పేర్కొన్నారు. అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగిస్తూ.. అవసరమైతే రివర్స్‌ టెండరింగ్‌ విధానం తీసుకొస్తామన్నారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాల అమలు చేస్తామన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి రూ.10 వేల పెన్షన్ అందజేస్తామని గవర్నర్ స్పష్టం చేశారు. గ్రామ వాలంటీర్ల ద్వారా నవరత్నాలను అమలు చేస్తామన్నారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.

గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తామని, రైతు కమిషన్‌ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ.12,500 ఇస్తామన్నారు. పగటిపూట వ్యవసాయానికి 9 గంటల కరెంట్‌ ఇస్తామన్నారు. వైఎస్‌ పాలన తరహాలో అందరికి ప్రభుత్వ ఫలాలు అందిస్తామన్నారు. రైతులకు వడ్డీలేని రుణాలు, ఉచిత బోరుబావులు వేయిస్తామని గవర్నర్ తెలిపారు. వైఎస్‌ఆర్‌ బీమా పథకం కింద రూ.7 లక్షలు ఇస్తామన్నారు. రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి.. ఆరోగ్య సంరక్షణ సేవ కింద రూ.1000 అందిస్తామని గవర్నర్ స్పష్టం చేశారు.

లైవ్ టీవి

Share it
Top