Top
logo

ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే స్వయంగా నేనే వస్తా..

ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే స్వయంగా నేనే వస్తా..
Highlights

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ అరెస్ట్‌పై జనసేనాని పవన్ కల్యాణ్‌ ఘాటుగా స్పందించారు. ప్రజల తరపున పోలీస్‌...

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ అరెస్ట్‌పై జనసేనాని పవన్ కల్యాణ్‌ ఘాటుగా స్పందించారు. ప్రజల తరపున పోలీస్‌ స్టేషన్‌‌కు వెళితే నాన్‌బెయిలబుల్‌ కేసులు పెడతారా అంటూ ఫైరయ్యారు. నెల్లూరులో జర్నలిస్ట్‌పై వైసీపీ ఎమ్మెల్యే దాడి చేసినా, కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించినా కేసులుండవా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్న పవన్ తానే స్వయంగా రాజోలు వచ్చి ప్రజలకు అండగా నిలబడతానన్నారు.

Next Story