ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని బహిరంగంగా శిక్షించాలి : పవన్ కళ్యాణ్

pawan kalyan
x
pawan kalyan
Highlights

అడబిడ్డలపై అఘాయిత్యాలు పాల్పడేవారికి బహిరంగ శిక్షలు ఉండాలి. శంషాబాద్‌ లో డాక్టర్‌ ప్రియాంక రెడ్డిని సామూహిక అత్యాదారం

రెండు తెలుగు రాష్ట్రలలో సంచలనం సృష్టించిన ప్రియాంకా రెడ్డి హత్య కేసుపై మామలు ప్రజలు మాత్రమే కాదు .. సెలబ్రిటీలు సైతం తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. నిందితులను బహిరంగంగా ఉరితీయాలని కోరుతున్నారు. ఇక దీనిపైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. అయన ఎం అన్నారో అయన మాటల్లోనే మీ కోసం...

" అడబిడ్డలపై అఘాయిత్యాలు పాల్పడేవారికి బహిరంగ శిక్షలు ఉండాలి. శంషాబాద్‌ లో డాక్టర్‌ ప్రియాంక రెడ్డిని సామూహిక అత్యాదారం చేసి హత్య చేసిన ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. మూగ జీవాలకు చికిత్స చేసే ప్రియాంక కొందరు మానవ మృగాల బారినపడి అన్యాయమైపోయింది. ఈ ఘోరాన్ని మనసున్న ప్రతి ఒక్కరూ ఖండించాలి. డా.ప్రియాంక రెడ్డి కుటుంబానికి నా తరపున, జనసైనికుల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

యత్ర నార్యేస్తూ పూజ్యంతే... రమంతే తత్ర దేవతా... అని మాట్లాడుకోవడానికి, రాసుకోవడానికి తప్ప ఆచరణలోకి తీసుకురావడం లేదు. ఇప్పుడు శంషాబాద్‌ ఘటన అనే కాదు... కొద్దిరోజుల కిందట చిత్తూరు జిల్లాలో ఆడుకొంటున్న చిన్నారిని ఒక దుర్మార్గుడు చిదిమి వేశాడు. మొన్నటికి మొన్న వరంగల్‌ లో ఓ

ఇంటర్మీడియట్‌ విద్యార్థినిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడి చంపేశాడు. నిర్భయ చట్టం తెచ్చిన బాలికలు, యువతులపై అత్యాచారాలు చేసేవాళ్లకు, వేధింపులకు పాల్పడేవారికీ ఎలాంటి బెదురూ రావడం లేదు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని బహిరంగంగా కఠిన రీతిలో శిక్షించాలి. సింగపూర్‌ లాంటి దేశాల్లో ఇలాంటి శిక్షలు ఉన్నాయి.

పోలీస్‌ శాఖ సైతం షీ టీమ్స్‌ ను మరింత బలోపేతం చేయాలి. శివారు ప్రాంతాల్లో పోలీస్‌ పెట్రోలింగ్‌, పర్యవేక్షణ పెంచాలి. విద్యార్ధునుల్లో యువతుల్లో ఆత్మస్థైర్యం పెంచడంతోపాటు ప్రాణ రక్షణకు మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్పించాలి." అంటూ పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories