సొంత ఊళ్లో వ్యవసాయం చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే

సొంత ఊళ్లో వ్యవసాయం చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే
x
TDP MLA Nimmala Ramanaidu
Highlights

కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం అయ్యారు.

కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం అయ్యారు. అందులో భాగంగా లో సొంత ఊరికి వెళ్లిన పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సొంత భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. ఇక మరోపక్కా తన నియోజకవర్గంలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. అయితే తన సొంత ఉరిలో వ్యవసాయం చేయడంతో రైతుగా తన అనుభవాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

"ఉరుకుప‌రుగుల జీవితంతో పుట్టి పెరిగిన‌ ప‌ల్లెల‌కు దూర‌మ‌య్యాం. మ‌నుషులు దూర‌మైనా మ‌న‌స్సులు ప‌ల్లెల్లోనే వుంటాయి. క‌రోనా వైర‌స్ క‌ల్లోలం రేపిన ఆధునిక‌కాలం పురాత‌న కాలాన్ని వెతుక్కుంటోంది. ప్రశాంతంగా, వైరాగ్యంగా అలా వెన‌క్కి తిరిగి మూలాల వైపు ప‌య‌నిస్తున్నాం. పాల‌కొల్లు మండ‌లంలో అగ‌ర్తిపాలెం మా సొంతూరు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను. ఈ గాలీ, ఈ నేల‌, సెల‌యేరు, భూమికీ ప‌చ్చాని రంగేసిన‌ట్టుండే పంట‌చేలు ఆల‌మంద‌లు, గింజలేరుకునే పిట్టలు జ‌న‌సంచారం లేక‌పోవ‌డంతో, కాలుష్యం త‌గ్గి ప్రకృతి మ‌ళ్లీ చిగురించిన‌ట్టనిపిస్తోంది. అగ‌ర్తిపాలెంలో అఆలు దిద్ది ఆంధ్రవిశ్వవిద్యాల‌యం ఎంఏ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ చేశాను. ప్రజల కోసం ప్రజల చేత ప్రజాప్రతినిధిగా ఎన్నిక‌య్యాను.

శాస‌న‌స‌భ్యుడిగా ఎన్నుకున్న ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండేందుకు పాల‌కొల్లులో ఉంటున్నా.. నా మ‌న‌స్సంతా నా ప‌ల్లెమీదే..ననుగ‌న్న నా త‌ల్లి మీదే! లాక్‌డౌన్ కాస్తా నా మ‌న‌సు వైపే లాక్కొచ్చింది. జోడెడ్ల బండిపై ఆడుతూ, పాడుతూ నా పల్లెకొచ్చేశాను. చేతికందికొచ్చే ద‌శ‌లో ధాన్యం.. నా క‌ళ్లలో నింపింది ధైర్యం. చేతి నుంచి జాలువారిని మేత‌గింజల్నందుకున్న‌ చేప‌ల సంద‌డి నా ప‌ల్లె..నా పంట‌..నా చెరువు..పుల‌కించిపోయాను..మైమ‌రిచిపోయాను.. ప‌ల్లెత‌ల్లి ఒడిలో సేద‌దీరిన సంగ‌తులు, పంట మడిలో ఊసులు, చెరువులో చేప‌ల బాస‌లు మీతో పంచుకుంటున్నాను" అని పేర్కొన్నారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories