logo

ఏపీలో మందు బాబులకు కొత్త రూల్స్..మూడు బాటిళ్లు దాటితే మోతే..

ఏపీలో మందు బాబులకు కొత్త రూల్స్..మూడు బాటిళ్లు దాటితే మోతే..
Highlights

సంపూర్ణ మద్య నిషేదం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వైసీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా దశలవారీగా...

సంపూర్ణ మద్య నిషేదం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వైసీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా దశలవారీగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ నూతన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఒక్కో వ్యక్తి దగ్గర మూడు బాటిళ్లకు మించొద్దని రూల్‌ పెట్టింది. ఏపీలో రాత్రి 9 గంటలు దాటితే మద్యం షాపులు మూత పడనున్నాయి. ఎమ్మార్పీ రేట్లకే మద్యం అమ్మకాలు జరపాలని, పర్మిట్‌ రూమ్‌లు రద్దు చేస్తున్నట్టు ఎక్సైజ్‌ శాఖ తెలిపింది. రోడ్లపై మద్యం సేవిస్తే శిక్ష తప్పదని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్‌ శాఖ అధికారలు తెలియచేశారు.


లైవ్ టీవి


Share it
Top