కోనసీమలో గ్యాస్ లీకేజ్ టెన్షన్.. చిన్న నిప్పురవ్వ వచ్చినా భారీ పేలుడు సంభవించే అవకాశం !

కోనసీమలో గ్యాస్ లీకేజ్ టెన్షన్.. చిన్న నిప్పురవ్వ వచ్చినా భారీ పేలుడు సంభవించే అవకాశం !
x
కోనసీమలో గ్యాస్ లీకేజ్ టెన్షన్
Highlights

తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ఉలిక్కిపడింది. ఓఎన్‌జీసీ బావిలో గ్యాస్‌ బ్లో అవుట్‌ సంభవించడంతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. గాలి ఎటువీస్తే అటు వైపు...

తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ఉలిక్కిపడింది. ఓఎన్‌జీసీ బావిలో గ్యాస్‌ బ్లో అవుట్‌ సంభవించడంతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. గాలి ఎటువీస్తే అటు వైపు గ్యాస్‌ మళ్లుతుండటంతో పరిసర ప్రాంతాలు భయం గుప్పెట్లో ఉన్నాయి. మరోవైపు పేలుడు సంభవించిన టైంలో అక్కడ ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. వారిని ఏ ఆసుపత్రికి తరలించింది అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.

జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎస్పీ నయీం అస్మి, ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమర్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఎటువంటి ప్రాణ నష్టం కలుగకుండా తక్షణమే లీకేజీ నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్యాస్ లీకేజీని ఆపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ONGC క్రైసస్ మేనేజ్మెంట్ బృందం రంగంలోకి దిగనుంది.

చిన్న నిప్పురవ్వ వెలువడినా పెను ప్రమాదం సంభవిస్తుందనే ఉద్దేశంతో చుట్టుపక్కల గ్రామాల్లో ఆటోలపై మైకుల ద్వారా అధికారులు ప్రచారం చేస్తున్నారు. మొబైల్‌ ఫోన్‌లు, ఫ్లాష్‌ లైట్లు కూడా ఉప్పూడి గ్రామ పరిసరాలకు తీసుకు రాకుండా పోలీసు, రెవెన్యూ యంత్రాంగం కట్టడి చేసింది. విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో ఘటనా స్థలం చుట్టుపక్కలంతా గాఢాంధకారం అలముకుంది. ఉప్పూడి గ్రామంలో 1600 మంది దాకా ఉన్నారు. వారిని చెయ్యేరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. అక్కడే వారికి ఆహారం అందిస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories