ప్రభుత్వ పాఠశాలలో 400 మంది విద్యార్థులకు ఒకే టాయిలెట్‌

ప్రభుత్వ పాఠశాలలో 400 మంది విద్యార్థులకు ఒకే టాయిలెట్‌
x
Highlights

ఆ పాఠశాలలో విద్యార్ధినీ విద్యార్ధులు బడిలో బారులు తీరారు. వాళ్లంతా బారులు తీరింది ఏ సిమా టిక్కెట్ల కోసం, సందర్శనశాల టిక్కెట్ల కోసమో కాదు. బడిలో ఉన్న...

ఆ పాఠశాలలో విద్యార్ధినీ విద్యార్ధులు బడిలో బారులు తీరారు. వాళ్లంతా బారులు తీరింది ఏ సిమా టిక్కెట్ల కోసం, సందర్శనశాల టిక్కెట్ల కోసమో కాదు. బడిలో ఉన్న టాయిలెట్‌ కోసం. స్కూల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య 400 మంది. కానీ అక్కడున్న టాయిలెట్స్‌ సంఖ్య మాత్రం ఒక్కటి. అంతమంది విద్యార్థులకు ఒకే ఒక్క టాయిలెట్‌ ఉండడంతో ఇబ్బందులే కాదు.. అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముంది. ఈ దుస్థితి మహబూబాబాద్‌ జిల్లాలో జరిగింది.

పొనుగోడు పాఠశాలలో సుమారు 400 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీళ్లందరికీ కలిపి ఒకటే టాయిలెట్‌ ఉంది. టాయిలెట్‌కి వెళ్లాలంటే మాత్రం.. క్యూలో నిలబడాల్సిందే. ఈ సమస్యపై పాఠశాల హెచ్‌ఎం పట్టించుకోవడం లేదని, తమ గోడు ఎవరూ వినట్లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories