కూల్చివేతలు-సెగలు

కూల్చివేతలు-సెగలు
x
Highlights

నెల్లూరు పట్టణంలో అక్రమ కట్టడాల కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. ఉదయాన్నే వెంకటేశ్వరపురం చేరుకున్న రెవెన్యూ, మున్సిపల్ అధికారులు జేసీబీలతో అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు.

నెల్లూరు పట్టణంలో అక్రమ కట్టడాల కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. ఉదయాన్నే వెంకటేశ్వరపురం చేరుకున్న రెవెన్యూ, మున్సిపల్ అధికారులు జేసీబీలతో అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. అధికారులు కూల్చివేసిన ఇళ్లలో టీడీపీకి చెందిన తాజా మాజీ కార్పొరేటర్ సల్మాకు చెందిన మూడు ఇల్లు కూడా ఉన్నాయి. అధికారులతో బాధితులు వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాల మధ్య వాగ్వదం జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టారు.

ప్రభుత్వ అనుమతి పత్రాలతోనే ఇళ్లు నిర్మించుకున్నామన బాధితులు చెబుతున్నారు. అక్రమ కట్టడాల పేరుతో ఇళ్లు కూల్చివేస్తున్నారని తెలుసుకున్న నగర టీడీపీ అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తన అనచరులతో కలిసి వస్తుండగా మసీదు సెంటర్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. కక్ష సాధింపుతోనే ఇళ్లు కూల్చివేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లలో అధికారంలోకి వచ్చేది తామేనంటూ పేదల ఇళ్లు ఎట్లా కూల్చివేస్తారో చూస్తామంటూ హెచ్చరించారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories