యాభై ఏళ్లుగా ఎన్నికలు లేవు.. అంతా ఏకగ్రీవమే..

యాభై ఏళ్లుగా ఎన్నికలు లేవు.. అంతా ఏకగ్రీవమే..
x
AP Elections
Highlights

ఎన్నికలు వస్తున్నాయి అంటే చాలు అధికారం దక్కించుకోవడం కోసం పార్టీలన్నీ డబ్బు, మద్యం, మాసం మొదలగు వాటితో ఓటర్లను మచ్చిక చేసుకుంటాయి. మరికొన్ని చోట్ల తమ ప్రత్యర్దులతో కలిసి ఓ నిర్ణయానికి వచ్చి ఏకగ్రీవంగా అయ్యేలా చూసుకుంటాయి.

ఎన్నికలు వస్తున్నాయి అంటే చాలు అధికారం దక్కించుకోవడం కోసం పార్టీలన్నీ డబ్బు, మద్యం, మాసం మొదలగు వాటితో ఓటర్లను మచ్చిక చేసుకుంటాయి. మరికొన్ని చోట్ల తమ ప్రత్యర్దులతో కలిసి ఓ నిర్ణయానికి వచ్చి ఏకగ్రీవంగా అయ్యేలా చూసుకుంటాయి.. కానీ ఓ రెండు గ్రామాలు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ చూట్టు ఉన్న గ్రామాలకి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలోని మెంటాడ మండలంలోని చింతలవలస, ఇద్దనవలస అనే ఈ రెండు పంచాయతీల పాలకవర్గాలు 50 ఏళ్లుగా ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఇప్పుడు కూడా ఇదే తరహ సాంప్రదాయాన్ని కొనసాగించాలని అనుకుంటున్నాయి.

చింతలవలస, ఇద్దనవలస పంచాయతీలు సుమారుగా యాభై సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. అప్పటినుంచి ప్రతీఎన్నికల సమయంలోనూ అక్కడి గ్రామస్తులందరూ ఒకదగ్గర సమావేశమై సర్పంచ్‌ వార్డు మెంబర్ల అభ్యర్థులను ఏకాభిప్రాయంతో నిర్ణయిస్తారు. అక్కడి గ్రామంలో ఎన్ని రాజకీయ పార్టీలున్నా సరే పంచాయతీ ఎన్నికలోచ్చేసరికి అందరూ ఒకేమాట మీదా నిలబడుతారు. ఈ సాంప్రదాయం ఇప్పటివరకు ఒక్కసారి కూడా మిస్ కాలేదు. అలా ఇప్పటివరకు సర్పంచ్‌, వార్డుమెంబర్‌ స్థానాలకు గాను ఒక్కసారి కూడా ఎన్నికలు జరగలేదు.. ఇక ఏకగ్రీవ పంచాయతీలకు గాను ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నిధులతో తమ గ్రామాలను అభివృద్ధి పధంలో నడిపిస్తారు..ఇక మిగతా ఏ ఎన్నికలైనా తమకి నచ్చిన పార్టీకి ఓటు వేస్తారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories