Andhra Pradesh: యూటర్న్ తీసుకున్న నర్సీపట్నం డాక్టర్ సుధాకర్

Andhra Pradesh: యూటర్న్ తీసుకున్న నర్సీపట్నం డాక్టర్ సుధాకర్
x
Highlights

విశాఖలో సంచలనం సృష్టించిన డాక్టర్ సుధాకర్ ఘటన విషయంలో కొత్త మలుపు తిరిగింది. కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న డాక్టర్ సుధాకర్ నాలుగో పట్టణ పోలీస్...

విశాఖలో సంచలనం సృష్టించిన డాక్టర్ సుధాకర్ ఘటన విషయంలో కొత్త మలుపు తిరిగింది. కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న డాక్టర్ సుధాకర్ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ వచ్చారు. నర్సీపట్నంలో రోడ్డుపై అసలు ఏం జరిగిందో తాజాగా వివరణ ఇచ్చారు. పథకం ప్రకారమే తనపై దాడి జరిగిందంటా సంచలన ఆరోపణలు చేశారు. గతంలో మాట్లాడిన వ్యాఖ్యలకు పూర్తి విరుద్దంగా మాట్లాడారు. తప్పు ఎవరిది ఉన్నా చర్యలు తీసుకోవాలంటూ సీఎం జగన్ ను కోరారు.

విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి డాక్టర్ సుధాకర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏపీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ సుధాకర్ తాజాగా ఆయన దేవుడంటూ ఆకాశానికెత్తారు. గత కొన్ని రోజులుగా అఙ్ఞాతంలో ఉన్న వైద్యుడు సుధాకర్ నిన్న విశాఖపట్నం నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌కి వచ్చారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు పూర్తి విరుద్దమైన వ్యాఖ్యలను వినిపించారు. తప్పు ఎవరిది ఉన్నా చర్యలు తీసుకోవాలన్నారు.

పిచ్చివాడనే ముద్రవేసి తనను చంపాలనుకుంటున్నారని డాక్టర్ సుధాకర్ ఆరోపించారు. సస్పెండ్ అయిన నాటి నుంచి బ్యాడ్ ఫోన్ కాల్స్ వస్తున్నాయని... టార్చర్ భరించ లేక బయటకు వెళ్లడానికి కూడా భయపడుతున్నానని చెప్పారు. బ్యాంక్ పనిమీద నక్కపల్లి వెళ్లాల్సి వచ్చిందని ఎవరో ఫాలో అవుతున్నారని కారు ఆపడంతో తనపై దాడి చేసి డబ్బు అపహరించుకు పోయారని తెలిపారు. పోలీసులకు తన గురించి తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. పోలీసులు కూడా తనను లారీ కింద పడేసి చంపేయాలని చూశారని డాక్టర్ సుధాకర్ ఆరోపించారు.

ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వ ఉద్యోగిగా చేరానని నిజాయితీగా విధులు నిర్వహించానని డాక్టర్ సుధాకర్ చెప్పారు. మాస్కుల విషయంలో ఎమ్మెల్యే గణేష్ ను కలుద్దామని వెళ్లానని ఇందులో ఎటువంటి రాజకీయాలు లేవన్నారు. జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నానంటు కొట్టారన్న సుధాకర్ తనకు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఎంతో ఇష్టమన్నారు. వైఎస్ పాదయాత్రలోనూ పాల్గొన్నానని చెప్పుకొచ్చారు. జీతం రాక ఇబ్బంది పడుతున్నానని సీఎం జగన్ క్షమించి తిరిగి ఉద్యోగం ఇప్పించాలని కోరారు.

మరో వైపు డాక్టర్ సుధాకర్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని వైజాగ్ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా ఆరోపించారు. పోలీస్ స్టేషన్ వచ్చి ఉద్యోగం కావాలంటున్నారని పోలీసులు ఉద్యోగం ఇస్తారా కావాలంటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకోవాలంటూ సలహా ఇచ్చామని పోలీస్ కమిషనర్ చెప్పారు. కేసు సీబీఐ విచారణలో ఉండగా పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. తాజాగా డాక్టర్ సుధాకర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగామారాయి. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories