కొత్త మలుపు తీసుకున్న ఆరుష్‌రెడ్డి మిస్సింగ్ మిస్టరీ

కొత్త మలుపు తీసుకున్న ఆరుష్‌రెడ్డి మిస్సింగ్ మిస్టరీ
x
Highlights

ఆరుష్‌ రెడ్డి మిస్సింగ్‌ మిస్టరీ కొత్త మలుపు తీసుకుంది. ఏలూరు రైల్వేస్టేషన్‌లో దొరికిన బాలుడు ఆరుష్‌ కాదని తేలడంతో.. మరి ఆ బాలుడెవరు..? అతడి...

ఆరుష్‌ రెడ్డి మిస్సింగ్‌ మిస్టరీ కొత్త మలుపు తీసుకుంది. ఏలూరు రైల్వేస్టేషన్‌లో దొరికిన బాలుడు ఆరుష్‌ కాదని తేలడంతో.. మరి ఆ బాలుడెవరు..? అతడి తల్లిదండ్రులెవరు..? తల్లి పొత్తిళ్లలో పెరగాల్సిన చిన్నారి.. రైల్వేస్టేషన్‌లో ఎలా ప్రత్యక్షమయ్యాడు..? తన కుమారుడే అన్న ఆ మహిళ ఎక్కడికెళ్లింది..?

ఈ చిన్నారి ఏ తల్లి కన్న బిడ్డో ఎవరికీ తెలీదు. ఇటీవల సంచలనం సృష్టించిన జషిత్‌ ను వెతికే క్రమంలో ఈ నెల 20 న ఏలూరు రైల్వేస్టేషన్‌లో 5 రోజుల క్రితం మధ్యం మత్తులో ఉన్న మహిళ పక్కన ఉండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి శిశు గృహంలో ఉంటున్న ఈ చిన్నారి ఎవరనే విషయాన్ని తెలుసుకునే ఎవరూ ప్రయత్నం చేయలేదు.

అయితే జషిత్‌ క్షేమంగా ఇంటికి చేరడంతో ఈ బాలుడే ఆరుష్ అనే అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని HMTV బృందం ప్రకాశం జిల్లాలో అదృశ్యమైన బాలుడి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ చిన్నారికి ఆరుష్ రెడ్డి పోలికలు ఉండటంతో ఆ తల్లిదండ్రులు సంబరపడ్డారు. తమ బిడ్డ దొరికాడని ఆనందపడ్డారు. అయితే వారి సంతోషం నిమిషాల్లోనే ఆవిరైపోయింది.

ఆ బాలుడు ఆరుష్ కాదని పోలీసులు నిర్ధారించారు. దీంతో ఏలూరులో దొరికిన ఈ చిన్నారి ఎవరనే ప్రశ్న తెరపైకి వచ్చింది. జషిత్ ను వెతికే క్రమంలో ఈ బాలుడిని స్వాధీనం చేసుకున్న పోలీసులు శిశు హోంలోకి తరలించారు. కానీ ఆ పిల్లాడు ఎవరనే దానిపై విచారణ చేయలేదు. అసలా బాలుడు ఎవరు..? రైల్వేస్టేషన్‌లో ఎందుకున్నాడు..? తన బిడ్డే అన్న మహిళ అందుకు ఆధారాలు తీసుకొస్తానంటూ ఇంతవరకు ఎందుకు రాలేదు..? ఆ బాలుడిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు..? ఆ చిన్నారి ఎందుకు తల్లిదండ్రులకు ఎందుకు దూరమయ్యాడు..? ఎన్నాళ్ల క్రితం తప్పిపోయాడు..? తప్పిపోయాడా..? లేక, కిడ్నాప్ చేశారా..? అసలు ఈ బాలుడు ఎవరి అబ్బాయి..? ఏలూరుకి ఎలా వచ్చాడు..? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

ఇలా రాష్ట్రంలో చిన్నారులు అదృశ్యమైన ఘటనలు చాలానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అయినా 5 రోజుల క్రితం దొరికిన బాలుడెవరనే దానిపై పోలీసులు ఎందుకు విచారణ చేపట్టలేదో ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో చాలా మిస్సింగ్‌ కేసుల్లో పురోగతి లేకపోవడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమనే వాదనలు వస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories