విశాఖలో వాహనదారులకు సరికొత్త నిబంధన

విశాఖలో వాహనదారులకు సరికొత్త నిబంధన
x
ఫైల్ ఫోటో
Highlights

మొన్నటి వరకు హెల్మెట్‌ పెట్టుకోవాలంటే బైక్‌ తోలేవారు బద్దకించేవారు. కాని ఇప్పుడు వందలకు వందలు ఫైన్స్‌ పడుతుండటంతో బయటకు వెళ్లేప్పుడు తప్పనిసరిగా బద్దకం మానేసి ఖచ్చితంగా హెల్మెట్‌ ధరిస్తున్నారు.

మొన్నటి వరకు హెల్మెట్‌ పెట్టుకోవాలంటే బైక్‌ తోలేవారు బద్దకించేవారు. కాని ఇప్పుడు వందలకు వందలు ఫైన్స్‌ పడుతుండటంతో బయటకు వెళ్లేప్పుడు తప్పనిసరిగా బద్దకం మానేసి ఖచ్చితంగా హెల్మెట్‌ ధరిస్తున్నారు. కాని ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే బండి వెనుక కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్‌ పెట్టుకోవాల్సిన పరిస్థితి రాబోతుంది. మొదట సింగిల్‌ హెల్మెట్‌పై ఫోకస్‌ పెట్టిన ట్రాఫిక్‌ పోలీసులు అది కాస్త సఫలం అవ్వడంతో ఇక డబుల్‌ హెల్మెట్‌పై యుద్దానికి సిద్ధమయ్యారు.

యాక్సిడెంట్‌ అయితే ముందు కూర్చున్న వారికి మాత్రమే కాకుండా వెనుక వారికి కూడా ప్రాణాపాయమే.అందుకే వెనుక ఉన్న వారికి కూడా సేఫ్టీ అవసరమని భావిస్తున్నారు. టూవీలర్‌కు డబుల్‌ హెల్మెట్‌ తప్పని చేసేందుకు నిబంధన విధించబోతుండటంతో విశాఖలో వారం రోజుల పాటు వాహన చోదకులకు అవగాహనకల్పించనున్నారు. ఈ రూల్స్‌ సక్సెస్‌ అయితే ఇకపై రెండు హెల్మెట్లు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పించేందుకు నగరంలో పలుచోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ముందున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని... వెనుక ఉన్నవారికి లేకపోయినా రూల్స్ ప్రకారం ఫైన్ కట్టాల్సి వస్తుందని వార్నింగ్‌ ఇవ్వనున్నారు.

విశాఖలో సుమారు 12 లక్షల వాహనాలు ఉండగా... వాటికి సైగానికి పైగా టూవీలర్సే. ఏటా 1500 పైగా రోడ్డు ప్రమాదాలు జరిగితే...400 మంది వరకు మృత్యువాత పడుతున్నారు. మరో 13 వందల మందికి పైగా గాయాలపాలవుతున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ కొత్తరూల్‌ను తీసుకురానున్నారు. టూవీలర్‌పై వెనుక కూర్చున్న వ్యక్తికీ హెల్మెట్ ఉండాల్సిందేనని అవగాహన కల్పిస్తున్నారు. హెల్మెట్‌ వాడకంపై అవగాహన కల్పిస్తే... మరణాలను తగ్గించవచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే వాహనదారులతో నిండిపోయిన విశాఖ.. రాజధానిగా మారిన తరువాత.. మరింత ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థిత ఏర్పడుతుందని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. పరిపాలనా రాజధానిగా ఆవిర్భవించబోతున్న విశాఖలో వాహన ప్రమాదాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని...అందుకే వెనక కూర్చున్న వారికి కూడా హెల్మెట్‌ను తప్పనిసరి చేయనున్నట్లు చెప్పారు. బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఇదీ తప్పనిసరే చేశారు. ఈ మధ్యే హైదరాబాద్‌లో ఈ నిబంధననను తప్పనిసరి చేయడంలో అలాంటి నిబంధనను విశాఖలో కూడా అమలు చేయనున్నారు ట్రాఫిక్ అధికారులు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories