Top
logo

ఏపీలో ప్రతిపాదనల దశలో కొత్త జిల్లాల అంశం

ఏపీలో ప్రతిపాదనల దశలో కొత్త జిల్లాల అంశం
X
Highlights

ఏపీలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలనే అంశం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉందని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్...

ఏపీలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలనే అంశం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉందని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ జరిగింది. పార్లమెంటు నియోజక వర్గాల ప్రాతిపాదికన జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ వెల్లడించారు. అయితే జిల్లాల ఏర్పాటుకు ముందే ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని సభ్యులు సూచించారు. దీనిపై కమిటీ లేదా అఖిల పక్షం ఏర్పాటు చేయాలని సభ్యులు కోరారు.

పరిపాలన సౌలభ్యంగా ఉండేలా జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. గిరిజన నియోజకవర్గాలను కలిపే సయమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సభ్యులు కోరారు. జిల్లాల ఏర్పాటు అంశం పరీశీలన స్థాయిలోనే ఉందని మంత్రి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. కొత్త జిల్లాల అంశం ప్రతిపాదన దశలోనే ఉందని.. సభ్యుల సూచనలు పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి చెప్పారు.

Next Story