చినకాకాని అత్యాచారం కేసులో కొత్త కోణాలు.. సర్టిఫికెట్లు..

చినకాకాని అత్యాచారం కేసులో కొత్త కోణాలు.. సర్టిఫికెట్లు..
x
Highlights

గుంటూరు జిల్లా చినకాకాని అత్యాచారం కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. సర్టిఫికెట్లు కావాలని వివాహితను నమ్మించి తీసుకెళ్లి అఘాయిత్యానికి...

గుంటూరు జిల్లా చినకాకాని అత్యాచారం కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. సర్టిఫికెట్లు కావాలని వివాహితను నమ్మించి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన శ్యామ్‌, నాగేశ్వరరావు, చైతన్యలను ఏఏస్పీ ఈశ్వరరావు విచారిస్తున్నారు. నిందితులను ఘటన స్థలానికి తీసుకెళ్లి విచారించనున్నట్లు తెలుస్తోంది.

తాడేపల్లికి చెందిన వివాహిత ఓ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సెంటర్‌లో పని చేస్తోంది. దూర విద్య కోర్సుల ద్వారా విద్యార్హతల దృవీకరణ పత్రాలు ఇప్పించాలంటూ ఆమెతో పరిచయం పెంచుకున్నారు. సర్టిఫికెట్ల గురించి మాట్లాడాలంటూ ఓ యువకుడు ఆమెను హాయ్‌ల్యాండ్ సమీపంలోకి తీసుకెళ్లాడు. తమ స్నేహితులు చినకాకాని వద్ద ఉన్నారని ముగ్గురికి సర్టిఫికెట్లు కావాలని చెప్పి చినకాకానికి తీసుకెళ్లాడు అక్కడికి వెళ్లిన తర్వాత ముగ్గురు యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు మంగళగిరి ఠాణాలో ఫిర్యాదు చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories