ఏపీ నూతన సీఎస్‌గా నీలం సాహ్ని బాధ్యతలు

ఏపీ నూతన సీఎస్‌గా నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించారు. ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి ఆలయ వేద పండితులు...
ఏపీ నూతన సీఎస్‌గా నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించారు. ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి ఆలయ వేద పండితులు ఆమెకు అశీర్వచనాలు అందించారు. తన మొదటి పోస్టింగ్ కృష్ణా జిల్లా మచిలీపట్నం అని ఇప్పుడు తిరిగి ఏపీకి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తానన్నారు నీలం సాహ్ని. కాగా జూన్ 20, 1960న జన్మించిన నీలం సహాని వచ్చే ఏడాది జూన్‌లో పదవీ విరమణ చేయనున్నారు. 1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె ఏపీ కేడర్ అధికారి. గతంలో డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులకు వెళ్లారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికార శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న నీలం సాహ్నిని రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు సోమవారం ఆ విధుల నుంచి రిలీవ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐఏఎస్‌లలో సీనియర్ అయిన ఆమెను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఏపీ సర్కారు నియమించింది.

లైవ్ టీవి
పౌరసత్వ సవరణ బిల్లు చించేసిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
9 Dec 2019 5:13 PM GMTభద్రాద్రి కళ్యాణానికి సిద్ధం అవుతున్న తలంబ్రాలు
9 Dec 2019 5:04 PM GMTదిశ కేసులో నిందితుల మృతదేహాలు గాంధీ ఆస్పత్రికి తరలింపు
9 Dec 2019 4:42 PM GMTరాశీఖన్నాకి ఆ రెండు సినిమాలే దిక్కు
9 Dec 2019 4:41 PM GMTరూటు మార్చిన ధోని..
9 Dec 2019 4:34 PM GMT