నార్నేకు ఆ నియోజకవర్గం కేటాయిస్తారా?

నార్నేకు ఆ నియోజకవర్గం కేటాయిస్తారా?
x
Highlights

సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు ఇటీవల వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో తాను టిక్కెట్ హామీతో చేరలేదని నార్నె పైకి...

సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు ఇటీవల వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో తాను టిక్కెట్ హామీతో చేరలేదని నార్నె పైకి చెబుతున్నా.. గుంటూరు జిల్లాలో తనకు ఎంపీ లేదా ఎమ్మెల్యే టిక్కెట్ కేటాయించాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. గుంటూరు పార్లమెంటు, చిలకలూరిపేట, పెదకూరపాడు అసెంబ్లీ సీట్లలో ఏదో ఒకటి ఇవ్వాలని జగన్ ను.. నార్నె కోరుతున్నారట.. అయితే చిలకలూరిపేట అసెంబ్లీ టిక్కెట్ విడదల రజిని, గుంటూరు ఎంపీ టిక్కెట్ మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి దక్కే అవకాశముంది. పెదకూరపాడుకు ఇటీవల శంకర్ రావును ఇంఛార్జిగా నియమించినా.. ఆయన పనితీరుపై వైసీపీ అధిష్టానం సంతృప్తితో లేదట.. దాంతో ఆయన స్థానంలో నార్నె శ్రీనివాసరావును పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారట.

గతంలో ఈ నియోజకవర్గంనుంచి బొల్లా బ్రహ్మనాయుడు పోటీచేసి ఓటమి చెందారు. దాంతో ఆయన తన సొంత నియోజకవర్గం వినుకొండ చూసుకున్నారు. ఈసారి వినుకొండ టిక్కెట్ బ్రహ్మనాయుడుకే దక్కే అవకాశముంది. బ్రహ్మనాయుడు వినుకొండకు మారడంతో అప్పటినుంచి మూడు నెలల కిందటి వరకు కూడా ఈ నియోజకవర్గం బాధ్యతలు కావటి మనోహర్ నాయుడు చూశారు. అయితే ఆయన పనితీరు సరిగా లేదన్న అభిప్రాయంతో అక్కడ శంకర్ రావును ఇంఛార్జిగా నియమించారు. ఇప్పుడు శంకర్ రావు పనితీరు మెరుగ్గా లేదన్న కారణనంతో నార్నేను బరిలోకి దింపే సూచనలు కనిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories