కోడెల రాసిన లేఖను బయటపెట్టిన నారా లోకేష్

కోడెల రాసిన లేఖను బయటపెట్టిన నారా లోకేష్
x
Highlights

కోడెల మృతిపై పొలిటికల్‌ హీట్‌ మరింత పెరిగింది. అధికార, ప్రతిపక్ష నాయకులు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. కోడెల శివప్రసాదరావు మరణం తర్వాత ...

కోడెల మృతిపై పొలిటికల్‌ హీట్‌ మరింత పెరిగింది. అధికార, ప్రతిపక్ష నాయకులు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. కోడెల శివప్రసాదరావు మరణం తర్వాత వైఎస్సార్‌సీపీ చేసిన ఆరోపణలపై స్పందించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్. కోడెల రాసిన లేఖను ట్వీట్టర్ ద్వార బయటపెట్టారు నారా లోకేష్.

'ఇదంతా మీరు, మీ శకుని మామ విజయసాయిరెడ్డి కలిసి కోడెల గారిని మానసికంగా దెబ్బతీసేందుకు, సమాజంలో వారికున్న మంచిపేరును చెడగొట్టేందుకు పన్నిన కుట్ర కాదా? మీరు దొంగలు అయినంత మాత్రాన అందరూ అలాంటివారి అనుకుంటే అంతకంటే నీచమైన ఆలోచన ఇంకొకటి ఉండదు' అంటూ నారా లోకేష్ ట్వీట్‌ చేశారు.

'ఐపీసీ 420 కింద కేసులున్న ప్రబుద్ధులు అలాంటి పనులే చేస్తారని పెద్దలంటుంటారు జగన్ గారు! కోడెలగారి విషయంలో కూడా మీరు అదే చేశారు. నిబద్ధత కలిగిన వ్యక్తిగా కోడెలగారు హుందాగా వ్యవహరించి మీ స్పీకర్ గారికి లేఖకూడా రాశారు. ఆయన కూడా అందిందని సంతకం చేశారు. అలాంటప్పుడు కేసులెలా పెడతారు?'అంటూ ప్రశ్నించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories