Top
logo

ట్విట్టర్‌ వేదికగా సీఎం జగన్‌పై నారా లోకేష్‌ ఆగ్రహం

ట్విట్టర్‌ వేదికగా సీఎం జగన్‌పై నారా లోకేష్‌ ఆగ్రహం
X
Highlights

ట్విట్టర్‌ వేదికగా నారా లోకేష్‌... సీఎం జగన్‌పై ధ్వజమెత్తారు. రైతులకు విత్తనాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి గారు...

ట్విట్టర్‌ వేదికగా నారా లోకేష్‌... సీఎం జగన్‌పై ధ్వజమెత్తారు. రైతులకు విత్తనాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి నీళ్లెలా తెస్తారని పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చలు జరిపారని ఎద్దేవ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల విత్తనాల కోసం ప్రజలు రోడ్డెక్కుతున్నారని ట్విట్టర్‌లో కామెంట్స్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాలు ఇవ్వాలని రైతులు రొడ్డెక్కుతున్నారని, రాజన్న రాజ్యం అంటే విత్తనాలు, ఎరువుల కోసం ఎదురుచూడటమేనా అని ప్రశ్నించారు. రాజన్న రాజ్యం అంటే రైతులు లాఠి దెబ్బలు తినాలా అని నిలదీశారు. గత ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమంతో కాలయాపన చేయకుండా రైతులకు విత్తనాలు అందించే పని మొదలుపెట్టండని ట్విట్టర్‌లో లోకేష్‌ సూచనలు చేశారు.
Next Story