logo

పీర్ల పండుగలో విషాదం..

పీర్ల పండుగలో విషాదం..
Highlights

కర్నూలు జిల్లా బి.తాండ్రపాడులో మొహరం కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. మొహరం సందర్భంగా గ్రామంలో పీర్ల...

కర్నూలు జిల్లా బి.తాండ్రపాడులో మొహరం కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. మొహరం సందర్భంగా గ్రామంలో పీర్ల ఊరేగింపు జరుగుతుండగా ఇంటిపై గోడ కూలి 15 మందికి గాయాలయ్యాయి. ఊరేగింపును చూడటానికి వచ్చిన వారు ఎక్కువ సంఖ్యలో ఇంటిపైకి ఎక్కడంతోనే ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.






లైవ్ టీవి


Share it
Top