కరోనా లక్షణాలు కనిసిస్తే తండ్రీ కొడుకులు వచ్చి టెస్టులు చేయించుకోండి : విజయసాయి రెడ్డి ఫైర్

కరోనా లక్షణాలు కనిసిస్తే తండ్రీ కొడుకులు వచ్చి టెస్టులు చేయించుకోండి : విజయసాయి రెడ్డి ఫైర్
x
Highlights

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్నప్పటికి కరోనా వైరస్ కేసులు మాత్రం తగ్గడం లేదు.. ఇక ఏపీలో కూడా కరోనా వైరస్ కేసులు రోజురోజుకి గణనీయంగా పెరుగుతున్నాయి.

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్నప్పటికి కరోనా వైరస్ కేసులు మాత్రం తగ్గడం లేదు.. ఇక ఏపీలో కూడా కరోనా వైరస్ కేసులు రోజురోజుకి గణనీయంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే నూట అరవై నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో అటు ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధికార పార్టీ తీరుపై విమర్శలు గుప్పిస్తోంది.. ఈ క్రమంలో టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వరుస ట్వీట్లు చేస్తూ పార్టీపై తీవ్ర విమర్శలుగుప్పించారు. అయితే దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ కౌంటర్లు వేశారు.

జగన్ గారు మీ ఇంటికొస్తే ఎం ఇస్తారు, మా ఇంటికొస్తే ఎం తెస్తారు అనే రకం. ఆయనకు కాంట్రాక్టర్ల పై ఉన్న ప్రేమ ప్రజలు, రైతులు, డాక్టర్లు, ఉద్యోగస్తులు పై లేకపోవడం బాధాకరం అని లోకేష్ అన్నారు. అంతేకాకుండా గత ఏడాది కంటే 30 వేల కోట్లు అధిక ఆదాయం ఉన్నా డాక్టర్లకు ఇచ్చే మాస్కులు, ఉద్యోగస్తుల జీతాల నుండి ప్రజలకు అందించే సహాయం వరకూ కోతలు పెడుతున్నారు. మరి కాంట్రాక్టర్ల పై కురిపించిన 6,400 కోట్లు ఆకాశం నుండి ఊడిపడ్డాయా? అంటూ మరో ట్వీట్ చేశారు.

ఇక కరోనా నేపథ్యంలో కేంద్రం చేస్తున్న సహాయం తాను చేస్తున్నట్టు బిల్డ్ అప్ ఇవ్వడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సాయం ఏమి లేదనీ, కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న 5 కేజీలు ఉచిత బియ్యం, ఒక కేజీ కందిపప్పు ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ ఒక్కరికి ఇవ్వలేదనీ లోకేష్ వాఖ్యనించారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లో కొన్ని చోట్ల 16 రకాల నిత్యావసరాలు ఉచితంగా ఇచ్చారు. సర్వం కోల్పోయిన ప్రజలకు కొన్నిరాష్ట్రాల్లో ఐదు వేల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. జగన్ గారు మాత్రం బీద అరుపులతో సరిపెడుతున్నారనీ అన్నారు.

అయితే దీని పైన ఎంపీ విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. 'కరోనా లక్షణాలు కనిసిస్తే తండ్రీ కొడుకులు వచ్చి టెస్టులు చేయించుకోండి. కొత్తగా 3 కరోనా నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు చేయించారు సిఎం జగన్ గారు. క్వారెంటైన్ సౌకర్యాలు కూడా పెరిగాయి. అందరికి టెస్టులు చేయాలనే ఏడుపుగొట్టు సలహాలొద్దు. ఎవరికి పరీక్షలవసరమో వైద్య నిపుణులకు తెలుసు' అంటూ కౌంటర్ వేశారు..




Show Full Article
Print Article
More On
Next Story
More Stories