Top
logo

వైభవంగా వైసీపీ ఎంపీ మాధవి పెళ్లి

వైభవంగా వైసీపీ ఎంపీ మాధవి పెళ్లి
Highlights

విశాఖ జిల్లా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పెళ్లి వైభవంగా జరిగింది. గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్‌ తో మాధవి కల్యాణం జరిగింది.

విశాఖ జిల్లా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పెళ్లి వైభవంగా జరిగింది. గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్‌ తో మాధవి కల్యాణం జరిగింది. ఈ తెల్లవారుజామున 3.15 గంటలకు శరభన్నపాలెంలో వీరి వివాహం జరిగింది. ఎంపీ మాధవి పెళ్లికి పలువురు ప్రముఖులు హాజరై ఆశీర్వాదం అందజేశారు.

టీచర్ గా తన ప్రస్థానం ప్రారంభించిన మాధవి తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరారు. సార్వత్రి ఎన్నికల్లో మాధవికి అరకు లోక్‌సభ స్ధానం నుంచి వైసీపీ ఎంపీగా విజయం సాధించారు. అంతేకాదు పార్లమెంట్‌లో అడుగుపెట్టిన ఎంపీల్లో అతి పిన్న వయస్కురాలిగా రికార్డ్ సాధించారు. పాతికేళ్లలోనే మాధవి పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.

Next Story