మంకీ.. మాంచి స్టూడెంట్‌!

మంకీ.. మాంచి స్టూడెంట్‌!
x
Highlights

అన్ని కోతుల్లోకల్లా ఈ కోతి రూటే సపరేటు. మనిషి కనిపిస్తే చాలు ప్రేమగా చూస్తుంది. ఆప్యాయంగా హగ్‌ చేసుకుంటుంది. పక్కన కూర్చుని ముచ్చట్లు వింటుంది. ఏకంగా...

అన్ని కోతుల్లోకల్లా ఈ కోతి రూటే సపరేటు. మనిషి కనిపిస్తే చాలు ప్రేమగా చూస్తుంది. ఆప్యాయంగా హగ్‌ చేసుకుంటుంది. పక్కన కూర్చుని ముచ్చట్లు వింటుంది. ఏకంగా బడిబాటే పట్టింది. వినడానికి విడ్డూరంగా ఉన్నా క్లారిటీ కావాలంటే స్టోరీలోకి ఎంటర్‌ కావాల్సిందే.

కొండముచ్చు చంటి పిల్లాడిలా బాలిక సంకలో కూర్చోన్న అరుదైన దృశ్యం కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం వెంగళంపల్లిలో కనిపించింది. పదిరోజుల క్రితం గవర్నమెంట్‌ స్కూల్‌లో ప్రత్యక్షమైన కొండముచ్చు విద్యార్దులతో పాటు పాఠాలు వినడం హాట్‌టాపిక్‌గా మారింది. అంతేకాక చిన్నారులతో హ్యాపీగా ఆడుకుంటూ గెంతులేస్తోంది. స్టూడెంట్స్‌ అన్న క్లాస్‌లకు మిస్‌ అవుతారేమో కాని ఈ కొండముచ్చు మాత్రం ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.

దగ్గర్లో ఉన్న అడవినుంచి వచ్చిన ఈ కొండముచ్చు విద్యార్థులతో పాటూ కూర్చొంటూ వారి బ్యాగుల్ని, పుస్తకాలను అటు ఇటూ తిప్పుతూ తెగ అల్లరి చేస్తోంది. క్లాస్‌రూంలో పిల్లలతో సమానంగా టీచర్లు చెప్పే లెసెన్స్‌ బుద్దిగా వినడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు స్కూల్‌పిల్లల భుజాలపైకి ఎక్కి సందడి చేస్తోంది. తలను ప్రేమగా నిమురడంతో పాటు హగ్‌ చేసుకోవడం చూస్తుంటే నిజంగా ఓ మాయలా అనిపిస్తోంది. పిల్లల పక్కన కూర్చోవడం వారు పెన్సిల్‌తో బుక్‌లో రాస్తుంటే బుద్దిగా చూస్తోంది. పిల్లలపక్కన కూర్చోని లంచ్‌ చేయడంతో పాటు ,చిన్నారులు ఇచ్చే తినుబండారాలను ముద్దుముద్దుగా తింటోంది.

బడి చుట్టూ తిరుగుతున్న కొండముచ్చు చేష్టలతో విద్యార్ధులతో పాటు ఉపాధ్యాయులు ముచ్చటపడుతున్నారు. క్లాస్‌లోకి వచ్చినా పిల్లల చుట్టూ తిరుగుతూ సందడి చేస్తున్నా తరిమేయడం లేదంటున్నారు. విద్యార్థులను ఏమీ అనకపోవడంతో కొండముచ్చును ఓ అతిథిగా భావించి తమలో ఒకరిగా చూసుకుంటున్నామంటున్నారు.

మాములుగా అయితే కొండముచ్చులను చూస్తేనే భయంతో వణికిపోతాం. అవి చేసే అల్లరి పనులు చాలా చిరాకు తెప్పిస్తాయి. ఊళ్ళ మీద పడి జనాలను నానా ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. కానీ ఈ మర్కటం చేస్తున్న చేష్టలు చూస్తే ముచ్చటేస్తోందని మచ్చిక చేసుకుంటే వానరాలు మనకు దగ్గరవుతాయని నిరూపించిందీ ఈ మంచి వానరమంటున్నారు స్థానికులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories