Top
logo

అ వెధవలకు శిక్ష పడాలని కోరుకుంటున్నా .. రోజా

అ వెధవలకు శిక్ష పడాలని కోరుకుంటున్నా .. రోజా
Highlights

ప్రకాశం జిల్లాలో ఓ మైనర్ బాలిక పై ఆరుగురు ఐదు రోజులు పాటు సాముహిక అత్యాచారం చేసిన సంగతి మనకు తెలిసిందే .. ఈ ...

ప్రకాశం జిల్లాలో ఓ మైనర్ బాలిక పై ఆరుగురు ఐదు రోజులు పాటు సాముహిక అత్యాచారం చేసిన సంగతి మనకు తెలిసిందే .. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో చాలా సంచలనం అయింది .. అయితే దీనిపైన నగిరి ఎమ్మెల్యే మరియు ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా స్పందించారు ..

తన ట్విట్టర్ ఖాతాలో రోజా " ఒంగోలులో మైనర్ బాలికను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.10 రోజుల పాటు 16 ఏళ్ల బాలికను అత్యాచారం చేసిన ఆ కామాంధులకు పడే శిక్షను చూసి ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలా శిక్షించాలి." అని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు ..అంతే కాకుండా "వైయస్ జగన్ గారి ప్రభుత్వం అంటే ఆడపిల్లలుకు పూర్తి రక్షణ కల్పించే ప్రభుత్వం. ఇప్పటికే మా సోదరి హోమ్ మంత్రి సుచరిత గారు స్పందించి కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన వెధవలకి కఠిన శిక్ష పడాలని కోరుకుంటున్నా." అని అనే మరో ట్వీట్ కూడా చేసారు ..
లైవ్ టీవి


Share it
Top